»   » సల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క ఖరారు!

సల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ హీరోగా యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించే భారీ బడ్జెట్ మూవీ ‘సుల్తాన్'లో హీరోయిన్ ఖరారైంది. హీరోయిన్ అనుష్క్ శర్మను లీడింగ్ లేడీగా ఖరారు చేసినట్లు యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

2008లో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘రబ్ దే బనాదీ జోడీ' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క శర్మ..... తొలి సినిమాతోనే విజయం అందుకుంది. తర్వాత మరో బాలీవుడ్ టాప్ స్టార్ ఆమిర్ ఖాన్ తో ‘పికె' చిత్రంలో నటించింది. తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ తో కూడా అవకావం దక్కించుకోవడం విశేషం.

 Anushka Sharma the leading lady in 'Sultan'

సల్మాన్ తో అవకాశం దక్కడంపై అనుష్క శర్మ సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనతో దిగిన ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ల నుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కర్జత్, ముంబై ప్రాంతాల్లో జరుపబోతున్నారు. ఓ వ్రెజ్లర్(కుస్తీ యోధుడు) రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

తన పాత్రకు తగిన విధంగా...సల్మాన్ ఖాన్ మార్షల్ ఆర్ట్స్, వ్రెజ్లింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని, ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ లార్నెల్ స్టోవాల్ ఆధ్వర్యంలో ఆయన శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించబోతున్న ఈచిత్రానికి.....కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు అలీ అబ్బాస్. 2016 ఈద్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
In a statement released by Yash Raj Films, Bollywood actress, Anushka Sharma has been finalized as the leading lady for the upcoming film 'Sultan'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu