twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chakda Xpress బయోపిక్‌లో అనుష్క శర్మ.. ఏ మహిళా క్రికెటర్ పాత్రలో అంటే?

    |

    బాలీవుడ్‌లో బయోపిక్స్ నిర్మాణం జోరందుకొన్నది. క్రీడాకారుల జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనల ఆధారంగా ఎంఎస్ ధోని, అజహర్ లాంటి బయోపిక్స్ ప్రేక్షకులను ఆలరించాయి. తాజాగా కపిల్ దేవ్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందిన 83 మూవీ కూడా సినీ విమర్శకులను, అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వెండితెరపై మహిళా క్రికెటర్ జీవితం ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో భారతీయ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన న్యూస్‌ను అధికారికంగా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

    షారుఖ్ ఖాన్‌తో కలిసి 2018లో జీరో అనే చిత్రంలో అనుష్క శర్మ నటించింది. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. జీరో సినిమా తర్వాత లాక్‌డౌన్లు, అనుష్క గర్బవతి కావడంతో గత రెండేళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ప్రస్తుతం కెరీర్‌పై ద‌ృష్టి పెడుతూ అనుష్క శర్మ బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    Anushka Sharma to potray as Jhulan Goswami in Chakda Xpress

    భారతీయ మహిళా క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన క్రికెటర్ ఝులాన్ గోస్వామి జీవితం ఆధారంగా ఛక్డా ఎక్స్‌ప్రెస్ రూపొందుతున్నది. ఈ చిత్రంలో గోస్వామిగా అనుష్క శర్మ నటించనున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

    ఛక్డా ఎక్స్‌ప్రెస్ చిత్రం గురించి అనుష్క శర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ అద్బుతమైనది. ఎన్నో త్యాగాలతో కూడిన జీవితం తెర మీద ఆవిష్కరించబోతున్నాం. భారతీయ మహిళా క్రికెట్‌కు, ప్రపంచ మహిళల క్రికెట్ రంగానికి ఎంతో స్పూర్తిని ఇస్తుంది. గోస్వామి క్రికెటర్ కావాలనుకొన్నప్పుడు.. క్రీడల్లో, క్రికెట్‌లో మహిళలు అనే విషయాన్ని ఊహించుకోలేని పరిస్థితి. తన కెరీర్‌లో ఎదురుపడిన సమస్యలను, ఒడిదుడుకులను అధిగమించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. మహిళల రొటీన్ జీవితానికి భిన్నంగా క్రికెట్ ఆడాలని నిర్ణయం తీసుకోవడానికి, క్రికెటర్‌గా మారడానికి చాలా కష్టపడింది అని అనుష్క శర్మ తెలిపారు.

    ఝులాన్ గోస్వామి ఆల్ రౌండర్. మహిళా క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్. భారతీయ క్రికెట్‌కు విశేష సేవలు అందించారు. ఆమె సేవలకు గాను.. 2007లో ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. 2010లో అర్జున అవార్డు, 2012లో పద్మశ్రీ అవార్డు అందుకొన్నారు.

    English summary
    Anushka Sharma to potray as Jhulan Goswami in Chakda Xpress. Anushka says that, It is a really special film because it is essentially a story of tremendous sacrifice. Chakda Xpress is inspired by the life and times of former Indian captain Jhulan Goswami
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X