సంపాదన బానే ఉంది, నిర్మాతగా మారుతున్న అనుష్క
ముంబై: తమ టాలెంటుతో సినిమా రంగంలో టాప్ రేంజికి ఎదిగి, పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం దక్కించుకునే హీరోయిన్లు....రెమ్యూనరేషన్ల విషయంలో కూడా టాప్ రేంజిలోనే ఉంటున్నారు. కొందరు తెలివైన హీరోయిన్లు తాము సంపాదించిన డబ్బును డబుల్ చేసుకోవడానికి సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నారు.
ఇప్పటికే పలువురు హీరోయిన్లు నిర్మాతలుగా మారి లాభాలు గడించారు. అందులో కొందరు నష్టపోయిన వాళ్లు ఉన్నారు. అఫ్ కోర్స్...సినిమా అనేది వ్యాపారం. వ్యాపారంలోకి అడుగు పెట్టే ముందు లాభనష్టాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. వీటన్నింటికీ సిద్ధమైన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సినిమా నిర్మాణంలో అడుగు పెడుతోంది.
బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'NH10' చిత్రానకి అనుష్క శర్మ సహ నిర్మాతగా వ్యవహరించనుంది. బాలీవుడ్ సినీనిర్మాణ సంస్థ Phantomతో కలిసి అనుష్క శర్మ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. నిర్మాతగానే కాదు...ఇందులో ముఖ్యమైన రోల్ పోషిస్తోంది అనుష్క.
ప్రస్తుతం అనుష్క వయసు కేవలం 25. అతి చిన్న వయసులోనే సినీ నిర్మాతగా మారిన తారల లిస్టులో అనుష్క కూడా చేరిపోయింది. కెరీర్లో ఇంత త్వరగా నిర్మాతగా మారడం సంతోషంగా ఉంది. నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలైంది. మున్ముంది మరిన్ని మంచి ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలని కోరుకుంటున్నాను' అని అనుష్క శర్మ వ్యాఖ్యానించింది.
'NH10' చిత్రానికి నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రోడ్ ట్రిప్‌లో దారి తప్పిన కొందరు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












