ఎంత లగ్జరీగా ఉందో.... అనుష్క-విరాట్ నివాసముండే అపార్ట్మెంట్ ఇదే (ఫోటోస్)
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. వివాహం అనంతరం విరుష్క జంట ముంబైలోని ఖరీదైన లగ్జరీ అపార్టుమెంటులో కాపురం పెట్టబోతున్నారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలోని సముద్ర తీరంలో ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ రెసిడెన్సియల్ ప్రాజెక్ట్ ఓంకార్ 1973లో ఈ అపార్టుమెంట్ ఉంది. ఈ ప్రాజెక్టులో మొత్తం మూడు టవర్స్ ఉండగా టవర్ 'సి'లో అనుష్క, కోహ్లి ఫ్లాట్ ఉంది. సముద్రం వైపు ఫేసింగ్ ఉండటం దీని ప్రత్యేకత.

2016లో కొనుగోలు చేసిన కోహ్లి
ముంబై వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.... విరాట్ కొనుగోలు చేసిన ఈ ప్లాట్ 7,171 స్కేర్ ఫీట్స్ వైశాల్యం కలిగి ఉంది. 2016లో కోహ్లి దీన్ని రూ. 34 కోట్లకు కొనుగోలు చేశారట.

35వ అంతస్తులో..
ఈ అపార్టుమెంటులోని 35వ అంతస్తులో కోహ్లి కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ ఉంది. 4 బెడ్రూంలు కలిగిన ఈ ఫ్లాట్ నుండి.....సముద్ర తీరం ఎంతో సుందరంగా కనిపిస్తుందని తెలుస్తోంది.

ఇదే అపార్టుమెంటులో మరో స్టార్ క్రికెటర్
ఇదే అపార్టుమెంటులోని 29వ అంతస్తులో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కూడా ఒక ఫ్లాట్ ఉందట.

ఊహించిందే జరిగింది
ఓకాంర్ ప్రాజెక్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ.... మా ప్రాజెక్టులో విరాట్ ఫ్లాటు కొన్న విషయం తెలియగానే.... చాలా మంది ఇందులో ఫ్లాట్స్ కొనేందుకు ముందుకు వచ్చారని, విరాట్ కు అంత ఫాలోయింగ్ ఉందని తెలిపారు.

అద్భుతమైన డిజైనింగ్
విరుష్క నివాసం ఉండబోయే ఈ అపార్టుమెంటులో ఆర్కిటెక్చరల్ డిజైన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయని, ఇందులో 13 అడుగుల ఎత్తులో సీలింగ్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన డెస్క్ లు, బాల్కనీ ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటున్నారు.

ఈ ఇంట్లోకి విరాట్-కోహ్లి ఎప్పుడు వెలుతున్నారు
తమ పెళ్లి రిజిస్ట్రేషన్ తర్వాతే అనుష్క-విరాట్ ఈ ఫ్లాట్ లోకి వెళ్లనున్నారు. ముంబైలోని కోర్టులో జనవరి 4న వీరు తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోనున్నారు. ఆ తర్వాత వీరు తమ కొత్త ఫ్లాట్ లోకి వెళతారని తెలుస్తోంది.

ముంబైలో, ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్
పెళ్లి వేడును ప్రైవేట్ గా జరుపుకున్న ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వెడ్డింగ్ రిసెప్షన్ ముగిసిన అనంతరం ఇద్దరూ కలిసి సౌతాఫ్రికా వెళ్లనున్నారు. అక్కడే హనీమూన్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











