అనుష్క- విరాట్ పెళ్లి ఫోటోలు అమ్ముకున్నారు, ఎందుకంటే?
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివాహం డిసెంబర్ 11న ఇటలీలోని టుస్కానీ ప్రాంతంలో సంగతి తెలిసిందే. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అథితులు మాత్రమే హాజరయ్యారు.
Recommended Video

తమ పెళ్లి గురించి ముందుగా ఎలాంటి ప్రకటన చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపించిన విరుష్క.... పెళ్లి జరిగిన తర్వాత అఫీషియల్‌గా ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటు కొన్ని ఫోటోలు పోస్టు చేశారు.

పెళ్లి ఫోటోలు అమ్మకానికి
పెళ్లి వేడుకకు ముందు నిశ్చితార్థం, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు కూడా ఇటలీలోనే జరిగాయి. అయితే ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఏవీ కూడా బయటకు రాలేదు. ఇవన్నీ ఓ ఫ్యాషన్ మేగజైన్‌కు అమ్మినట్లు తెలుస్తోంది.

ఆ డబ్బుతో ఏం చేస్తారు?
ఈ ఫొటోలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని అనుష్క, విరాట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు తప్ప ఇతర ఫోటోలు బయటకు రానివ్వలేదని టాక్.

ఎంత మొత్తానికి అమ్మారు?
అయితే ఈ ఫోటోలను ఎంత మొత్తానికి అమ్మారు అనే విషయం బయటకు రాలేదు. హీరోయిన్ అనుష్క, క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఇమేజ్ ఆధారంగా ఈ ఫోటోలను భారీ ధరకు అమెరికా కేంద్రంగా నడిచే ఓ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మేగజన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

రెండు చోట్ల భారీగా వివాహ విందు
పెళ్లి వేడుకకు కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించిన నేపథ్యంలో డిసెంబర్ 21న ఢిల్లీలో, డిసెంబర్ 26న ముంబయిలో వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. పెళ్లి తర్వాత ఇద్దరూ ముంబైలో నివాసం ఉంటారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











