సూపర్ స్టార్‌తో అనుష్క మరోసారి
తొలి సినిమాతోనే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో నటించే అవకాశం దక్కించుకున్న అనుష్క శర్మ మరోసారి ఆయనతో రొమాన్స్ చేసే అవకాశం కొట్టేసింది. 'హ్యాపీ న్యూ ఇయర్' అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి ఫరాఖాన్ దర్శకురాలు. ఇందులో తొలుత షారూఖ్‌కు జోడీగా కత్రినాకైఫ్ లేదా కరీనాకపూర్‌ని కథానాయికగా ఎంచుకోవాలనుకున్న దర్శకురాలు చివరకు అనుష్క శర్మను ఫైనల్ చేసిందట. వాస్తవానికి ఈచిత్రం షారుఖ్-ఫరా కాంబినేషన్లో వచ్చిన 'ఓం శాంతి ఓం' చిత్రం తర్వాతే ప్రారంభం కావాల్సి ఉంది.
అనుకోని కారణాలతో సినిమా ఆగిపోవడం, తర్వాత షారుఖ్-ఫరా మధ్య గొడవలు రావడం, ఫరా భర్తపై షారుఖ్ దాడి తదితర కారణాలతో ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైంది. అప్పుడు ఈ సినిమాకు అనుకున్న హీరోయిన్లు ఇప్పుడు బిజీగా ఉండటంతో అనుష్క శర్మకు ఆ అవకాశం దక్కింది. షారుఖ్ తో మరోసారి నటించే అవకాశం రావడంతో అనుష్క ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ప్రస్తుతం అనుష్క 'మాతృ కి బిజిలీ మండోలా', యస్ రాజ్ చోప్రా నిర్మిస్తున్న ఓ సినిమాతో పాటు, బాంబే వెల్ వెట్ అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











