twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మృతి తర్వాత డిప్రెషన్‌పై అనుష్కశెట్టి షాకింగ్ పోస్ట్. కష్టాలు వస్తే..

    |

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకోవడం అందర్నీ కలిచివేస్తున్నది. ఈ క్రమంలో సినీ తారలు దీపికా పదుకోన్, పలువురు నటీనటులు డిప్రెషన్‌పై తమ అనుభవాలను నెటిజన్లు, సెలబ్రిటీలతో పంచుకొంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ జేజేమ్మ అనుష్క శెట్టి స్పందించారు. మానసిక రుగ్మతపై అనుష్క ఓ అర్ధవంతమైన సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు. డిప్రెషన్ గురించి తన సోషల్ మీడియా అకౌంట్‌లో లేఖను పోస్టు చేస్తూ..

    కష్ట:సుఖాలు జీవితంలో భాగమని

    కష్ట:సుఖాలు జీవితంలో భాగమని

    అనుష్క శెట్టి తన పోస్టులో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కష్ట: సుఖాలు లైఫ్‌లో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి జీవితంలో మరొకరు ఉంటే దాని వల్ల కలిగే సానుకూలతను మాటల్లో చెప్పలేం అని అనుష్క్ అన్నారు.

    మంచి, చెడు అంటూ ఏవీ ఉండవు

    మంచి, చెడు అంటూ ఏవీ ఉండవు


    ఎవరి జీవితం ఫర్‌ఫెక్ట్ కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అలాంటి పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. జీవితంలో మంచి దారి అని, చెడు దారి అంటూ జీవితానికి రోడ్ మ్యాప్ ఉండదు అంటూ అనుష్క భావోద్వేగంగా ఓ సందేశాన్ని అనుష్క తన లేఖలో అందించారు.

    డిప్రెషన్‌లో ఉన్నప్పుడు

    డిప్రెషన్‌లో ఉన్నప్పుడు

    ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కొందరు వాటి నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు మరొకరి సహాయం కోసం ఎదురు చూస్తారు. మరికొందరు మౌనంగా బాధలను అనుభవిస్తారు. మరికొందరు తమదైన శైలిలో గట్టేందుకు ప్రయత్నిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మానవత్వాన్ని ప్రదర్శించాలి. ఎదుటి వారితో కలిసి మెలిసి ఉండటం, ప్రేమను పంచడం నేర్చుకోవాలి అని అనుష్క శెట్టి చెప్పారు.

    Recommended Video

    Sushant Singh Rajput’s గర్ల్ ఫ్రెండ్ Rhea Chakraborty To Be Qestioned By పోలీస్
    మానసికంగా ధృడంగా

    మానసికంగా ధృడంగా

    ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే.. ఇతరులతో తన బాధలను పంచుకొనేందుకు ప్రయత్నించాలి. మానసికంగా ధృడంగా మారేందుకు అలవాటు చేసుకోవాలి. కష్టాల్లో ఉంటే ఎదుటి వారితో నవ్వుతూ పలకరించాలి. ఎదుటి వారి బాధలను తమ బాధలని భావించి వారితో కష్టాలను పంచుకోవాలి. వారి సమస్య ఏమిటో తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలి అంటూ అనుష్క తన సుదీర్ఘమైన లేఖలో అనుష్క చెప్పారు.

    English summary
    Tollywood actor Anushka Shetty post letter in her social media accout about depression after Sushant Singh Death. She mentioned that people to be more compassionate and caring, while stressing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X