Anushka Shetty: పెళ్లొద్దు కానీ.. ప్రెగ్నెంట్ అయ్యేందుకు మగాడు కావాలంటున్న అనుష్క
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ ట్రైలర్ కట్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే....
హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుర్ర హీరోతో కలిసి అనుష్క ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జాతి రత్నాలు లాంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి, నిశ్శబ్దం లాంటి సినిమా తర్వాత అనుష్క కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాతలు విడుదల చేశారు. మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అనిపించేలా ట్రైలర్ కట్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఫన్ ఎంటర్ టైన్మెంట్స్ గా నవీన్ పోలిశెట్టి కామెడీ మార్కుతో ఆధ్యంతం ఆకట్టుకుంటుంది.

'అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది బ్రో... కానీ అబ్బాయిలకి లిస్ట్ ఏంవుండదు. జస్ట్ అమ్మాయి అయితే చాలు'.. అంటూ నవీన్ పోలిశెట్టి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ. నాకేం ప్రాబ్లం లేదు. వైరల్ అయిపోతాం... వామ్మో ఏటు పోతుందిరా సమాజం.. ఇది బ్రో జోన్ కాదు.. అటు ఫ్రెండ్స్ జోన్ కాదు.. ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గైయ్స్.. లాంటి నేటి యూత్ కనెక్ట్ అయ్యే ఫన్నీ డైలాగ్స్ తో ట్రైలర్ ను నింపేశారు.
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే... మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో నటించారు. అనుష్క ఈ సినిమాలో పెళ్లి వద్దు కానీ పిల్లలను కనేందుకు ఓ మగాడు కావాలి అనుకుంటుంది. ఇక నవీన్ పోలిశెట్టి నచ్చడంతో.. ఆయనకు ఈ విషయం చెబుతుంది. దీనికి నవీన్ శెట్టి ఒప్పుకున్నాడా... లేదా అనుష్కను పెళ్లి చేసుకున్నాడా అనేది తెలియాలంటే... సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

మిస్ శెట్టి మిస్టర్ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. సందీప్ కిషన్, జగపతి బాబు, రెజీనా, కళ్యాణి ప్రధాన తారలుగా 'రారా కృష్ణయ్య' అనే చిత్రాన్ని తెరకెక్కించిన పి. మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది అనుష్కకు 48వ చిత్రం. యూవీ క్రియేషన్స్, అనుష్క కాంబినేషన్‌లో 'మిర్చి', 'భాగమతి' సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశారు.


Click it and Unblock the Notifications











