ఆ హీరోకు అనుష్క యోగా పాఠాలు...!
హైదరాబాద్ : హాట్ బ్యూటీ అనుష్క్ బేసిక్‌గా యోగా టీచర్ అనే విషయం తెలిసిందే. నాగ చైతన్యకు యోగా టీచర్ అయిన ఆమె నాగార్జున సపోర్టుతో సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత స్వీటీ అందాలకు, యాక్టింగుకు సౌత్ సినీ లోకం దాసోహం అయి పోయింది. అరేబియన్ గుర్రం లాంటి ఆమె హాట్ ఫిగర్‌ను చూసి మనసు పడని హీరో ఎవరు చెప్పండి!
పరిశ్రమలో అడుగు పెట్టి ఇంత కాలమైనా తన ఫిగర్‌ను ఇంత సెక్సీగా ఉంచుకోవడానికి కారణం ఆమె రోజూ యోగా చయడమే. ప్రతి రోజూ క్రమం తప్పకుండా అనుష్క యోగాసనాలు చేస్తుంది. ప్రస్తుతం తమిళ హీరో ఆర్యతో కలిసి 'ఇరండమ్ ఉలగం'(తెలుగులో బృందావనంలో నందకుమారుడు) చిత్రంలో నటిస్తున్న అనుష్క సెట్లో రోజూ ఉదయం క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తుందట. ఆమెను చూసి యోగా పట్ల ఇంట్రస్టు పెంచుకున్న హీరో ఆర్య ఆమె స్టూడెంట్ గా చేరి పోయాడు.
ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. ఇక ఈ సినిమాలో బృందావనంలో గోపికగా అనుష్క ఆరబోయనున్న అందచందాల కోసం కుర్రకారు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈచిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజుల క్రితం జార్జియా అడవుల్లో జరిగింది. 85 మంది మగాళ్ళ మధ్య జార్జియా అడవుల్లో అనుష్క ఒంటరిగా గడిపింది. అక్కడ బెడ్ ఉండదు. కరెంట్ ఉండదు. ఏ ఇతర వసతులుండవు. అయినా అనుష్క ఏ కంప్లయింట్ చేయలేదట. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











