Just In
- 8 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 1 hr ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెరీ వెరీ క్యూట్ : అనుష్క చిన్నతనంలో ఇలా (ఫోటో)
హైదరాబాద్: సూపర్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క...ఆ తర్వాత వెను దిరిగి చూసుకోలేదు. అటు గ్లామర్ ప్రధానమైన పాత్రలు, ఇటు పెర్ఫార్మెన్స్ ప్రధానమైన పాత్రలతో పాటు మరో వైపు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకెలుతోంది. అనుష్క ప్రస్తుతం బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అందం పరంగా....అనుష్కతో పోల్చదగిన వారు టాలీవుడ్లో మరెవరూ లేరనే చెప్పాలి. హైటు పరంగా, ఫిజిక్ పరంగా సెక్సీ లుక్స్‌తో ఆమె ఎంతో మంది కలలరాణిగా మారింది. సోషల్ నెట్వర్కింగులోనూ ఆమెను ఫాలోవర్స్ 80 లక్షల పైనే. తాజాగా అనుష్క తన అభిమానుల కోసం తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది.

అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. నాగార్జున హీరోగా రూపొందిన ‘సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
అందాల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపింది. వేదంలో సరోజగా కవ్వించినా, బిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో అందాలతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా ఆమెకే ఆమే పోటీ..సాటి అన్నట్లుగా వెండి తెరను వేడిక్కించింది.
ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. మొదట్లో అనుష్క అందాల ప్రదర్శనికే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క ఇప్పుడు భారీ పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు ఇటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు.
ఇప్పటికే అరుంధతి సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో తన సత్తా చాటిన అనుష్క త్వరలో మరో రెండు భారీ యాక్షన్ చిత్రాల్లో వెండి తెరపై తన తడాకా చూపెట్టబోతోంది. ప్రస్తుతం అనుష్క రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి' చిత్రంతో పాటు, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి' చిత్రాల్లో నటిస్తోంది.