చిరంజీవి, రామ్ చరణ్‌పై అనుష్క కామెంట్స్.. ఆయనది ప్రయత్నం, ఈయనది శక్తి అంటూ
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. చిరంజీవి కెరీర్ లో మొట్టమొదటి సారి చారిత్రక సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. చిరంజీవి సహా చిత్రంలో నటించిన తారాగణం మొత్తానికి మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అనుష్క తనదైన శైలిలో స్పందించింది.

పాత్ర చిన్నదే అయినా అదే ముఖ్యం
సైరా నరసింహా రెడ్డి సినిమాలో అనుష్క పోషించిన పాత్ర చిన్నదే అయినా అదే సినిమాలో అత్యంత ముఖ్యం. ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర పోషించిన అనుష్క.. తన సైనికులకు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్పతనాన్ని వివరిస్తుంది. సినిమా ప్రారంభం, ముగింపు రెండూ అనుష్క తోనే జరుగుతాయి. సో ఈమె పోషించిన పాత్ర ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

సైనికుల్లో ధైర్య సాహసాలు నింపేందుకు
తమ సైనికుల్లో ధైర్య సాహసాలు నింపడానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను వివరిస్తుంది ఝాన్సీ లక్ష్మీబాయ్ (అనుష్క). స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించి అతనెలా పోరాడారు, ఎలా ప్రాణ త్యాగం చేశారో చెబుతుంది. ఈమె నేరేషన్ లోనే సైరా నరసింహా రెడ్డి సినిమా రన్ అవుతుంది.

సైరా అనే గొప్ప ప్రయాణం
కాగా సైరా విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి అనుష్క స్పందించింది. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్‌చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. సైరా అనే గొప్ప ప్రయాణంలో తనను భాగం చేసినందుకు గాను తన ఆనందాన్ని వెల్లడించింది అనుష్క.

రామ్‌చరణ్ ప్రయత్నం.. మెగాస్టార్ శక్తి
తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి జీవితాన్ని వెండితెరపై తీసుకు రావడానికి రామ్‌చరణ్ ప్రయత్నించారని, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిగారు తన శక్తినంతా ఉపయోగించి జీవించారని అనుష్క తెలిపింది. చరిత్రలో కనిపించకుండా పోయిన గొప్ప యోధుడి సినిమాలో తన భాగాన్ని తాను చేశానని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది అనుష్క. ఈ సందర్బంగా తనను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది స్వీటీ.

'సైరా నరసింహా రెడ్డి' విశేషాలు
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో మెగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి.


Click it and Unblock the Notifications











