»   » ఇలా మెసేజ్ ఇచ్చింది : వైరల్ అవుతున్న అనుష్క ఫొటో

ఇలా మెసేజ్ ఇచ్చింది : వైరల్ అవుతున్న అనుష్క ఫొటో

Posted By:
Subscribe to Filmibeat Telugu
వైరల్ అవుతున్న అనుష్క ఫొటో Anushka Shetty Posted A Photo

టాలీవుడ్ లో ఈ తరానికి లేడీ "హీరో" అనదగ్గ నటి ఎవరన్నా ఉన్నారూ అంటే అది అనుష్క నే. దాదాపు హీరోలతో సమానమైన క్రేజ్ ఆమె సొంతం. తనకు తానుగా సోలో హిట్లని ఇచ్చిన మహిళా నటి ఒకప్పుడు విజయ శాంతి తర్వాత ఇప్పుడు మళ్ళీ అనుష్క నే ఉంది. అటు గ్లామర్ రోల్స్ చేస్తూ కూడా అరుంధతి, రుద్రమదేవీలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకూ ఆమె కేరాఫ్ అడ్రస్స్ అయ్యింది. మేల్ డామినేటెడ్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ జేజమ్మ (అక్టోబర్ 11) 'అంతర్జాతీయ బాలికల దినోత్సవం' సందర్బంగా అమ్మాయిలకు అదిరిపోయే సందేశం ఇచ్చింది.

"మన సమాజంలో మహిళల హోదాను మెరుగుపరచడానికి అందరం కలిసి పనిచేద్దాం. ఈ భూమిపై ఉన్న ప్రతీ అమ్మాయి తాను తన క్షేమం, చదువు, సమాన హక్కులు పొందటానికి అర్హురాలు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ ఓ చిన్నారితో సంతోషంగా దిగిన ఓ ఫోటోను తన ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసింది అనుష్క. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‎మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Anushka Shetty Face Book post on International Day of Girl Child ‬

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న ఈమె తాజాగా 'భాగమతి' సినిమాలో నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జి. అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

English summary
‪"let's work together for betterment of status of girls in our society Every Girl on this earth deserves to feel safe, to have Quality Education and Equal Rights" Posted Anushka Shetty on International Day of Girl Child.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu