twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క సంచలనాలు.. హాలీవుడ్ నటులతో.. బరువు తగ్గాక పర్ఫెక్ట్!

    |

    బాహుబలి చిత్రంలో దేవసేనగా అందరిని మెప్పించిన అనుష్క ఆ తర్వాత సినిమాల జోరు తగ్గించింది. బాహుబలి తరువాత అనుష్క నటించిన చిత్రం భాగమతి మాత్రమే. ఈ చిత్రంలో తాను లేడి సూపర్ స్టార్ అనే విధంగా అనుష్క నటన కనబరిచింది. అనుష్క బాహుబలి తరువాత కాస్త బొద్దుగా మారింది. ఓ దశలో అనుష్క పుణ్యక్షేత్రాలని సందర్శిస్తుంటే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లే అని ప్రచారం జరిగింది. ఆ ఊహాగానాలకు తెరదించుతూ అనుష్క కోన వెంకట్ రచయితగా సిద్ధం చేసిన కథలో అనుష్క నటించేందుకు సిద్ధం అవుతోంది.

    సంచలనానికి సిద్ధం

    సంచలనానికి సిద్ధం

    అనుష్క సౌత్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్. సరైన కథతో అనుష్క ప్రధాన పాత్రలో లేడి ఓరియెంటెడ్ చిత్రం చేసినా ఘనవిజయం సాధిస్తుంది. దీనితో రచయిత కోన వెంకట్, దర్శకుడు హేమంత్ మధుకర్ అనుష్కతో సంచలన చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం హర్రర్ నేపథ్యంలో సాగుతుందట. ప్రముఖ నటుడు మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు.

    హాలీవుడ్ నటులు

    హాలీవుడ్ నటులు

    ఈ చిత్రం గురించి కోన వెంకట్ ఆసక్తికర విశేషాలు తెలియజేశారు.ఈ సినిమా యుఎస్ బ్యాక్ డ్రాప్ లో హర్రర్ కథతో సాగుతుందని వివరించాడు. ఈ చిత్రం కోసం కొందరు హాలీవుడ్ నటుల్ని కూడా ఎంపిక చేసుకోబోతున్నట్లు కోన వెంకట్ అన్నారు. తమ చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో నిర్మిస్తుండడానికి కారణం బాహుబలి చిత్రమే అని కోన అన్నారు. బాహుబలి సినిమా టాలీవుడ్ మార్కెట్ ని దేశవ్యాప్తంగా విస్తృతం చేసింది.

    క్రేజీ దర్శకుడితో అనుష్క.. ఆస్ట్రేలియాకు వెళ్లిన జేజమ్మ <br /> క్రేజీ దర్శకుడితో అనుష్క.. ఆస్ట్రేలియాకు వెళ్లిన జేజమ్మ

    తెలుగు నటులు తరచుగా వెళ్లే ప్రాంతం

    తెలుగు నటులు తరచుగా వెళ్లే ప్రాంతం

    ఇదిలా ఉండగా ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గింది. ఇప్పడు పాత్రకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ గా ఉందని కోన వెంకట్ అన్నారు. తెలుగు నటులు తరచుగా ఫిట్ నెస్ కోసం వెళ్లే ఆస్ట్రియాలోని మైర్ ఆయుర్వేద క్లినిక్ లో అనుష్క బరువు తగ్గినట్లు కోన వెంకట్ తెలిపారు. అనుష్క ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేదో ఇపుడు అలా ఉందని అంటున్నారు.

    బాగా కలిసొచ్చిన జోనర్

    బాగా కలిసొచ్చిన జోనర్

    హర్రర్ చిత్రాలు అనుష్కకు బాగా కలిసొచ్చాయి. అనుష్క నటించిన అరుంధతి చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ఈ ఏడాది విడుదలైన భాగమతి కూడా మంచి విజయం సాధించింది. భాగమతి తరువాత బాగా గ్యాప్ రావడంతో అనుష్క సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మాధవన్, సుబ్బరాజుతో పాటు మరొక ప్రముఖ నటుడు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Anushka Shetty in first Telugu crossover film. The name of Hollywood actors will be revealed soon once everything is finalised.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X