»   » అనుష్క భూమి కొనుగోలు చేసింది ఎవరి కోసం?

అనుష్క భూమి కొనుగోలు చేసింది ఎవరి కోసం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అనుష్క భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. తాజాగా ఆమె హైదరాబాద్‌లో ల్యాండ్ కొనుగోలు చేసింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఆమె ల్యాండ్ కొన్న మాట వాస్తవమే కానీ తన కోసం కాదు...తన వద్ద పని చేసే వారి కోసం.

తన వద్ద కొన్నేళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న వారి కోసం అనుష్క ఈ ల్యాండ్ కొనుగోలు చేసిందని, వారికి ఇళ్లు కూడా కట్టించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. అనుష్కకు అందమైన రూపం మాత్రమే కాదు, అంతకంటే అందమైన మనసు కూడా ఉందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఆ మధ్య తమిళ హీరో అజిత్ కూడా తన వద్ద పని చేసే డ్రైవర్ నుండి తోటమాలి వరకు అందరికీ చెన్నైలో ఇళ్లు కట్టించిన సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Anushka Shetty Gifting Houses For Staff

అనుష్క ప్రస్తుతం ‘రుద్రమదేవి', ‘బాహుబలి' అనే రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ‘రుద్రమ దేవి' చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ చేస్తోంది. అనుష్క భర్తగా రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

దీంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి' చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్ హీరో. ఈ చిత్రం కూడా తర్వలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

English summary
Popular Telugu heroine Anushka Shetty is now following the footsteps of her latest co-start, the white haired superstar 'thala' Ajith. Both these lead actors are going to entertain audiences very soon with their "Yennai Arindhaal" that is going to hit screens in February. As the get ready to rock, here comes how our heroine took a clue from her onscreen hero.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu