నాకు సిగ్గు ఎక్కువ.. అందుకే వాటికి దూరం.. అనుష్క శెట్టి
బాహుబలి, భాగమతి చిత్రాలతో దక్షిణాదిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్‌గా అనుష్క శెట్టి పేరు సంపాదించుకొన్నారు. అయితే ఇంతకు ముందులా సినిమాల వేగాన్ని తగ్గించినట్టు కనిపిస్తున్నారు. ఆమె చేతిలో నిశ్శబ్దం మూవీ తప్ప మరో చిత్రం ఉన్నట్టు అధికారికంగా సమాచారం లేదు. అయితే ఇటీవల లాక్‌డౌన్‌లో తన వ్యక్తిగత జీవితం, అభిప్రాయాలను వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

తెర మీద వీరనారి పాత్రలతో
తెర మీద వీరనారి పాత్రలతో దుమ్మురేపే అనుష్క శెట్టి నిజ జీవితం అత్యంత సౌమ్యురాలు అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తుంది. వీరత్వం, కమాండ్ అనేది తెరమీద వరకు పరిమితం. వాస్తవంగా ఆమెలో సున్నితత్వం ఇతరుల్లో కనిపించదు. చాలా భిన్నమైన వ్యక్తిత్వమని పలువురు చెప్పుకొంటారు.

ఇన్స్‌టాగ్రామ్, సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో
అయితే అందరు హీరోయిన్ల మాదిరిగా అనుష్క శెట్టి భేషజాలు ప్రదర్శించరు. సోషల్ మీడియాలో ఊకదంపుడు కామెంట్లు, అతి తెలివి ప్రదర్శించే పోస్టులకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. ట్విట్టర్ ఖాతా లేని హీరోయిన్‌గా ఆమెపై ముద్ర పడింది. కాకపోతే ఇన్స్‌టాగ్రామ్‌లో 50 లక్షల ఫాలోవర్స్, ఫేస్‌బుక్‌లో 22 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం ఓ రికార్డు.

సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించకపోవడానికి
సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించకపోవడానికి కారణం నా వ్యక్తిగత స్వభావమే. నాకు కొత్త వారితో కలిసి పోవడమంటే కష్టమైన పని. ఫిల్మ్ సెట్స్‌లోకి వెళ్లితే అందరితో కలిసిపోతుంటాను. సినిమా ప్రపంచంతోనే కాలం గడిచిపోతుంటుంది. సోషల్ మీడియా వరకు వస్తే నాకు టైమ్ ఉండదు. అంతగా గుర్తు కూడా ఉండదు అని అనుష్క చెప్పారు.

సిగ్గు, మొహమాటం ఎక్కువ
వాస్తవానికి నాకు సిగ్గు ఎక్కువ. కొత్తవారితో మాట్లాడటానికి మొహమాట పడుతుంటాను. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాను. ట్విట్టర్‌లో చేరమని చాలా మంది చెప్పినా ఎందుకు సాధ్యం కావడం లేదు. మనకు తెలియని వారితో ఛాటింగ్ చేయాలన్న, వారితో భావాలు పంచుకోవాలన్న నాకు సరిపడదు. అందుకే వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటాను అని అనుష్క చెప్పారు.
Recommended Video

నిశ్శబ్దం సినిమాతో రెడీగా
అనుష్క కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన నిశ్శబ్దం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ విడుదల కావాల్సిన సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో మాధవన్, మైఖేల్ మ్యాడ్‌సెన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల తదితరులు నటించారు. త్వరలోనే ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











