ఫోటోలు : సినిమాల్లోకి రాకముందు టీచర్‌గా అనుష్క
హైదరాబాద్ : హీరోయిన్ అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. అప్పుడు తన సహచర ఉపాధ్యాయులతో కలిసి దిగిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.
నాగార్జున హీరోగా రూపొందిన 'సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. స్వీటీ అనే ముద్దుపేరున్న అనూష్క తన అందాల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపుతోంది. వేదంలో సరోజగా కవ్వించినా, బిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో అందాలతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా ఆమెకే ఆమే పోటీ..సాటి అన్నట్లుగా వెండి తెరను వేడిక్కిస్తోంది.
ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. మొదట్లో అనుష్క అందాల ప్రదర్శనికే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క ఇప్పుడు భారీ పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

ఈస్ట్‌వుడ్ పాఠశాలలో సహచర ఉపాధ్యాయులతో కలిసి అనుష్క, రెండో లైన్లో 7వ వ్యక్తి

ప్రస్తుతం అనుష్క రుద్రమదేవి, బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. వర్ణ అనే మరో భారీ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

సూపర్ తర్వాత అస్త్రం, చింతకాయల రవి, స్వాగతం, ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. అందులో క్లైమాక్స్ లో జింతాత అంటూ ఆమె చేసే అభినయానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

చిరంజీవి స్టాలిన్ లో ఐటం సాంగ్ (ప్రత్యేక నృత్యం)చేసినా ఆ తర్వాత వాటికి దూరంగా ఉండిపోయింది. తన ఇమేజ్‌కు తగిన సినిమాలు చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటూ వస్తోంది.

తమిళంలో మాధవన్ సరసన ‘రెండు' చిత్రం ద్వారా పరిచయమైన ఆమె సూర్యతో చేసిన యముడు(సింగం)తో అక్కడివారికి ఆరాధ్య దేవతగా మారింది.


Click it and Unblock the Notifications











