వావ్...సచిన్‌తో పాటు హాట్ బ్యూటీ అనుష్క (ఫోటోలు)
విజయవాడ: ఆగస్టు 1వ తేదీన విజయవాడలో ప్రారంభం కానున్న సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ 'పివిపి స్వ్కేర్' ప్రారంభోత్సవం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా నిర్వహించబడనున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సచిన్ తో పాటు హాట్ బ్యూటీ అనుష్క కూడా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.
సినిమా, రాజకీయ మరియు పారిశ్రామిక రంగాల నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాలు పంచుకోనున్నారు. విజయవాడలో అత్యంత ఘనంగా జరుగనున్న ఈ వేడుకలను పివిపి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.

సచిన్, అనుష్క
అత్యంత ఘనంగా నిర్వహించనున్న పివిపి స్వ్కేర్ ప్రారంభోత్సవ వేడుకకు సచిన్‌తో పాటు అనుష్క కూడా హాజరవుతున్నట్లు సమాచారం.

పివిపి స్వ్కేర్
ప్రసాద్ వి పొట్లూరి విజయవాడలో ‘పివిపి స్వ్కేర్' పేరుతో ఓ కాంప్లెక్స్ నిర్మించారు.

అత్యాధునిక సొగబులు
ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న మాల్స్ -కాంప్లెక్స్ లను తలదన్నేలా అత్యాధునిక సౌకర్యాలతో నవతరం సొగబులతో పాటు సాంప్రదాబద్దమైన వ్యవస్థీకరణతో రూపుదిద్దుకున్న ‘పివిపి స్వేర్'ను ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.

ప్రసాద్ వి పొట్లూరి
కొత్తగా ఏర్పడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కు పివిపి స్వ్కేర్ ఓ రాజమకుటంలా ఉండబోతోందని, త్వరలోనే ఇండస్ట్రియల్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందనున్న విజయవాడకు పివిపి స్వ్కేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పి.వి.పి బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
తెలుగు, తమిళ భాషల్లో భారీ చిత్రాలు నిర్మిస్తూ అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా మారిన పి.వి.పి సంస్థ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి..నిర్మాతగానే కాకుండా వ్యాపార వేత్తగానూ తన దక్షతను ఘనంగా చాటుకుంటూ ఆ రంగంలోనూ విజయబావుటా ఎగురవేస్తున్నారు.
క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన ప్రసాద్ వి.పొట్లూరి 'ఐబిఎల్-ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్'లో ప్రాంచైజీ ఓనర్‌గా ఉన్నారు. ఆయన ఫ్రాంచైజీ ఓనర్‌గా ఉన్న 'హైదరాబాద్ హాట్ షాట్స్' జట్టు సైనా నెహ్వాల్ నేతృత్వంలో 2013 ఐబిఎల్ ట్రోపీ గెలుచుకుంది. అలాగే దీంతో పాటు పివిపి 'ది గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ తో కలిసి ఇండియన్ సాకర్ లీగ్ లోకి అడుగిడిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











