twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ పేరెత్తగానే భగ్గుమన్న అనుష్క.... కరకు సమాధానం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Anushka on Prabhas : Don't Expect Romance from me and Prabhas

    ప్రభాస్, అనుష్క వెండితెరపై చూడముచ్చటైన జంట. మిర్చి, బాహుబలి, బాహుబలి 2 లాంటి చిత్రాల్లో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఎంతలా అంటే ఆడియన్స్ సైతం ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా భార్య భర్తలు అయితే బావుండు అని కోరుకునేంతగా. ఆ మధ్య ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ కూడా చాలా వచ్చాయి. అయితే అనుష్క పలు సందర్భాల్లో వీటిని ఖండించింది.

    ఆగ్రహం వ్యక్తం చేసిన అనుష్క

    ఆగ్రహం వ్యక్తం చేసిన అనుష్క

    తన తాజా చిత్రం ‘భాగమతి' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క..... అక్కడ ప్రభాస్ గురించిన ప్రశ్న ఎదురవ్వగానే సహనం కోల్పోయారు. అగ్రహంగా సమాధానం ఇచ్చారు. తరచూ ప్రభాస్‌తో పెళ్లి అనే ప్రశ్న ఎదురవుతుండటంతో ఆమె విసుగుచెంది ఇలా ప్రవర్తించినట్లు స్పష్టమవుతోంది.

    బాహుబలి-దేవసేన కెమిస్ట్రీ రియల్ లైఫ్‌లో వర్కౌట్ కాదు

    బాహుబలి-దేవసేన కెమిస్ట్రీ రియల్ లైఫ్‌లో వర్కౌట్ కాదు

    ప్రభాస్, నేను పెళ్లి చేసుకోవడం లేదు. దయచేసి బాహుబలి, దేవసేన రొమాన్స్ రియల్ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయవద్దని, నిజ జీవితంలో అది వర్కౌట్ కాదు అని ఈ సందర్భంగా అనుష్క కోరారు.

    పదే పదే ఎందుకు విసిగిస్తున్నారు?

    పదే పదే ఎందుకు విసిగిస్తున్నారు?

    తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, పెళ్లి చేసుకోవడం లేదని ఎన్నిసార్లు చెప్పినా మీడియా పదే పదే ఇదే విషయం అడిగి ఎందుకు విసిగిస్తున్నారు అంటూ అనుష్క మండి పడ్డారు.

    స్నేహం తప్ప మరేమీ లేదు

    స్నేహం తప్ప మరేమీ లేదు

    ప్రభాస్, నేను మంచి స్నేహితులం. మా ఇద్దరి మధ్య స్నేహాన్ని మించి మరేమీ ఊహించుకోవద్దు. మేము పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పటికీ జరుగదు అని అనుష్క తేల్చి చెప్పారు.

    వెడ్డింగ్ రూమర్స్ తోసి పుచ్చిన ప్రభాస్

    వెడ్డింగ్ రూమర్స్ తోసి పుచ్చిన ప్రభాస్

    ప్రభాస్ కూడా ఇటీవల తన పెళ్లి వార్తలను ఖండించారు. తనకు ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని, తన దృష్టంతా సినిమాల మీదనే ఉందని ప్రభాస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

    లింకప్ రూమర్స్ లైట్ తీసుకున్న ప్రభాస్

    లింకప్ రూమర్స్ లైట్ తీసుకున్న ప్రభాస్

    అయితే తనకు, అనుష్కకు లింకప్ పెట్టి రూమర్స్ రావడాన్ని ప్రభాస్ లైట్ తీసుకుంటున్నారు. వరుసగా రెండు మూడు సినిమాలు కలిసి నటిస్తే ఇలాంటి రూమర్స్ సహజమే అని ప్రభాస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    ఇపుడు బాధ పడటం లేదు

    ఇపుడు బాధ పడటం లేదు

    ఇలాంటి వార్తలు నాకు ఇపుడు నార్మల్ అయ్యాయి. అయితే గతంలో ఇలాంటివి విని కాస్త బ్యాడ్ ఫీలయ్యేవాడిని, ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు? అనుకునే వాడిని... అయితే క్రమ క్రమంగా అవి అలవాటు అయిపోయాయి అని ప్రభాస్ తెలిపారు.

    ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మరోలా..

    ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మరోలా..

    ఓ వైపేమో తనకు పెళ్లి ఆలోచన లేదని ప్రభాస్ చెబుతుంటే.... ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు మాత్రం త్వరలోనే ప్రభాస్ వివాహం జరుగబోతోందంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదు.

    English summary
    People love the pairing of Anushka Shetty & Prabhas. So much so that they started expecting that the duo will tie the knot soon just like 'Baahubali tied knot with Devsena'. Sorry but we have to burst your dream bubble as Anushka gave a very blunt reply when asked about Prabhas and it will surely break many hearts of 'Pranushka' fans. Wanna know why she lost her cool when asked about Prabhas? Keep reading!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X