Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిశ్శబ్దం సినిమా అనుష్మ చేయాల్సింది కాదట.. ఆ రైటర్ రావడంతో ప్లాన్ రివర్స్?
బాహుబలి, భాగమతి సినిమాల అనంతరం చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి చాలా రోజుల తరువాత విభిన్నమైన టాక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన నిశ్శబ్దం సినిమా ఊహించని విధంగా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి నెగిటివ్ టాక్ ను అందుకుంది. అనుష్క గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదనే టాక్ కూడా వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమాను మొదట అనుష్క చేయాల్సింది కాదట.
దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథను మొదట రెజీనా కసాండ్రాకు చెప్పాడట. కథను పూర్తిగా ఒక సైలెంట్ ఫిల్మ్ గా తెరకెక్కించాలని అనుకున్నారట. ఒక్క మాట కూడా లేకుండా స్క్రీన్ ప్లే మేకింగ్ తోనే ఆడియేన్స్ కి సరికొత్త థ్రిల్ ఇవ్వాలని అనుకున్నారు. రెండేళ్ల క్రితం చిన్న బడ్జెట్ లోనే ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో PVP ప్రొడక్షన్ తో కలిసి సినిమాను తెరకెక్కించాలని హేమంత్ ఒక ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఆ తరువాత కథ గురించి తెలుసుకున్న కోన వెంకట్ దర్శకుడి ఆలోచన విధానాన్ని మొత్తం మార్చేశాడు.
సినిమాలో అనుష్క శెట్టి అయితే కరెక్ట్ గా సెట్టవుతుందని కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయించి అర్దాన్నే మార్చేశారు. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ ఉందని మాధవన్, అంజలి వంటి స్టార్స్ ని కూడా సపోర్టింగ్ పాత్రల కోసం సెలెక్ట్ చేసుకున్నారు. అయితే సినిమా విడుదల తరువాత వారు అనుకున్న ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ కాలేదని చాలా క్లియర్ గా అర్ధమయ్యింది.
అనుష్క స్థాయికి తగ్గట్టు కథలేదనే కామేంట్స్ కూడా వచ్చాయి. మొత్తానికి ఓటీటీలో విడుదల చేసి మంచి పని చేశారనే అభిప్రాయాలు కూడా వచ్చాయి. లేకుంటే థియేటర్స్ లో విడుదల చేస్తే భారీగా నష్టపోయే అవకాశం ఉండేదనే టాక్ కిడా వచ్చింది. ఇక ఇటీవల ఒక రూమర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిశ్శబ్దం సినిమాను థియేటర్స్ మళ్ళీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే నాని V సినిమాను కూడా థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..