అనుష్కకు అక్కడేం పని?, ప్రభాస్ కోసమేనా!.. ఏమైనా దాస్తున్నారా?

Recommended Video

అనుష్కకు అక్కడేం పని ? ప్రభాస్ కోసమేనా !

అనుష్క-ప్రభాస్ ల గురించి ఎప్పుడూ ఏదో గాసిప్ పుట్టుకొస్తూనే ఉంది. మా మధ్య ఏమి లేదని వారిద్దరూ ఎన్నిసార్లు చెప్పినా.. ఈ ఊహాగానాలకు తెరపడటం లేదు.ఇద్దరూ కలిసి కనిపించిన ప్రతీసారి.. ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా అనుష్క అకస్మాత్తుగా ప్రభాస్ 'సాహో' సెట్స్ లో దర్శనమివ్వడంతో.. మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అనుష్కకు అక్కడేం పని? అన్న ఆరా మొదలైంది.

 'సాహో' షూటింగ్:

'సాహో' షూటింగ్:

ప్రస్తుతం 'సాహో' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత దుబాయిలో షూటింగ్ జరగనుంది. షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండటంతో.. హీరోయిన్ అనుష్క సరదాగా సెట్‌కి వెళ్లారు.

 సుజిత్‌తో సెల్ఫీ:

సుజిత్‌తో సెల్ఫీ:

సెట్స్‌లో చిత్ర యూనిట్‌తో అనుష్క కొద్దిసేపు గడిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సుజిత్‌, నటుడు మురళీశర్మతో కలిసి అనుష్క సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 స్నేహమేనా?..:

స్నేహమేనా?..:

అనుష్క 'సాహో' సెట్స్‌కు వెళ్లడంతో ప్రభాస్ కోసమే వెళ్లిందా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. చాలాకాలంగా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అయితే అది అక్కడికే పరిమితమని అంతకుమించి ఏమి లేదని వారు చెబుతూ వస్తున్నారు. అయినా సరే, వీరిద్దరూ ఏదో దాస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.

 'సాహో'లో ముందు అనుష్కనే?..::

'సాహో'లో ముందు అనుష్కనే?..::

నిజానికి 'సాహో' సినిమా కోసం కూడా తొలుత అనుష్కనే హీరోయిన్ గా తీసుకోవాలని భావించినట్లు ప్రచారం జరిగింది. కానీ శ్రద్దాకపూర్ ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ జరుగుతుందన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ అనుష్క ఆలోచనను విరమించుకుంది.

 అతిథి పాత్రలో?:

అతిథి పాత్రలో?:

ఇదిలా ఉంటే, 'సాహో' సెట్స్‌లో అనుష్క కనిపించడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. సినిమాలో అనుష్క అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అనుష్క 'అతిథి' పాత్ర కోసమే వెళ్లారా?.. లేక ప్రభాస్ కోసం వెళ్లారా?.. అన్నది మాత్రం ఆమెకే తెలియాలి.

దాస్తున్నారా?:

దాస్తున్నారా?:

'సాహో'లో అనుష్కతో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఏమైనా ప్లాన్ చేశారా? అన్న వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదల వరకు ఈ విషయాన్ని రివీల్ చేయవద్దని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే మరోసారి తెరపై ప్రభాస్-అనుష్కల జోడీని చూడవచ్చేమో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X