Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పిల్లల్ని కనాలని ఉంది.. నేను పెళ్లి చేసుకోనే వ్యక్తి ఎవరంటే.. అనుష్క
బాహుబలి సినిమా తర్వాత అనుష్క నటించిన భాగమతి చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఆ విజయాన్ని ఆస్వాదించుకొంటూ మీడియాతో సంతోషాన్ని పంచుకొంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి, వరుడి గురించిన విషయాలను ప్రస్తావించారు. ఇంతకీ తన పెళ్లిపై, భాగమతి సినిమాపై అనుష్క ఏమన్నారంటే..
భాగమతితో ఆనందంగా
భాగమతి సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత సోలో హిట్ ఎంజాయ్ చేస్తున్నాను. కేవలం సినిమా నా భారంపైనే మోసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే అని అనుష్క పేర్కొన్నది.
నాపై పెళ్లి ఒత్తిడి పెరిగింది
బాహుబలి తర్వాత నా పెళ్లి గురించిన వార్తలు రావడంతో ఒత్తిడి పెరిగింది. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోమని చెబుతున్నారు. మీడియాలో కూడా ఎక్కడ పడితే పెళ్లి గురించి రూమర్లే వస్తున్నాయి అని అనుష్క చెప్పింది
పిల్లలంటే నాకు ఇష్టం
నాకు పెళ్లి పట్ల మంచి నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ సరైన సమయంలో వివాహం చేసుకొంటాను. నాకు పిల్లల్ని కనాలనే కోరిక ఉంది. పిల్లలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది.
సరైన సమయంలో పెళ్లి
ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. నా మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. అదే విషయాన్ని నా తల్లిదండ్రులు చెబుతున్నారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను అని జేజేమ్మ తన మనసులో మాట బయటపెట్టింది.
50 కోట్ల క్లబ్లో భాగమతి
తాజాగా అనుష్క నటించిన భాగమతి చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రెండోవారంలోకి ప్రవేశించినా ఇంకా ప్రేక్షకాదరణ తగ్గకపోవడంపై చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నది.