twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్లల్ని కనాలని ఉంది.. నేను పెళ్లి చేసుకోనే వ్యక్తి ఎవరంటే.. అనుష్క

    By Rajababu
    |

    బాహుబలి సినిమా తర్వాత అనుష్క నటించిన భాగమతి చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఆ విజయాన్ని ఆస్వాదించుకొంటూ మీడియాతో సంతోషాన్ని పంచుకొంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి, వరుడి గురించిన విషయాలను ప్రస్తావించారు. ఇంతకీ తన పెళ్లిపై, భాగమతి సినిమాపై అనుష్క ఏమన్నారంటే..

    భాగమతితో ఆనందంగా

    భాగమతితో ఆనందంగా

    భాగమతి సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత సోలో హిట్ ఎంజాయ్ చేస్తున్నాను. కేవలం సినిమా నా భారంపైనే మోసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే అని అనుష్క పేర్కొన్నది.

    నాపై పెళ్లి ఒత్తిడి పెరిగింది

    నాపై పెళ్లి ఒత్తిడి పెరిగింది

    బాహుబలి తర్వాత నా పెళ్లి గురించిన వార్తలు రావడంతో ఒత్తిడి పెరిగింది. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోమని చెబుతున్నారు. మీడియాలో కూడా ఎక్కడ పడితే పెళ్లి గురించి రూమర్లే వస్తున్నాయి అని అనుష్క చెప్పింది

    పిల్లలంటే నాకు ఇష్టం

    పిల్లలంటే నాకు ఇష్టం

    నాకు పెళ్లి పట్ల మంచి నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ సరైన సమయంలో వివాహం చేసుకొంటాను. నాకు పిల్లల్ని కనాలనే కోరిక ఉంది. పిల్లలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది.

    సరైన సమయంలో పెళ్లి

    సరైన సమయంలో పెళ్లి

    ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. నా మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. అదే విషయాన్ని నా తల్లిదండ్రులు చెబుతున్నారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను అని జేజేమ్మ తన మనసులో మాట బయటపెట్టింది.

    50 కోట్ల క్లబ్‌లో భాగమతి

    50 కోట్ల క్లబ్‌లో భాగమతి

    తాజాగా అనుష్క నటించిన భాగమతి చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రెండోవారంలోకి ప్రవేశించినా ఇంకా ప్రేక్షకాదరణ తగ్గకపోవడంపై చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నది.

    English summary
    Anushka Shetty is happy with the response from the audiences for the movie Bhaagmathiee. After a long time, the actress is enjoying a solo hit to the fullest. Meanwhile, there is a lot of pressure on her to respond to marriage. Anushka revealed that she would get married when the right time comes. She also gave an explanation for the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X