Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భాగమతిలో ఇద్దరు అనుష్కలు? ఈ సినిమాతో ఇది మూడోసారి
'అరుంధతి', 'పంచాక్షరి' సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన అనుష్క అశోక్ దర్శకత్వం లో వస్తున్న భాగమతి లో కూడా డ్యూయల్ రోల్ చేస్తోందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాహుబలి చిత్రాల తర్వాత అనుష్క నటిస్తోన్న భాగమతి ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ హిస్టారికల్ డ్రామాకు గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. బాహుబలి 2 మూవీతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన అనుష్క అప్ కమింగ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అనుష్క అరుంధతి, రుద్రమదేవి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవడంతో తిరిగి మహిళా ప్రాధాన్యత ఉన్న హిస్టారికల్ చిత్రంలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని డీల్ చేస్తున్నాడు దర్శకుడు అశోక్.
Recommended Video
భారీ బడ్జెట్‌తో
‘భాగమతి' షూట్ ఇప్పటికే పూర్తయింది. యువీక్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసున్నట్లు సమాచారం.. ఇక మూవీని డిసెంబర్లో రిలీజ్ కి ముహూర్తం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
రెండు రోల్స్ ఎంతో డిఫరెంట్
గతంలో 'అరుంధతి', 'పంచాక్షరి' సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చేస్తోందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె పోషిస్తున్న ఈ రెండు రోల్స్ ఎంతో డిఫరెంట్‌గా ఉండనున్నాయని తెలుస్తోంది. ఒక పాత్ర ప్రేక్షకులు ఊహించని రీతిలో ట్విస్ట్ తో సాగుతుందని వార్తలు వస్తున్నాయి.
లావు కారణం గానే లేట్
అనుష్క కెరీర్‌కు ప్రతికూలంగా మారిన అంశాల్లో ఆమె బరువు ఒకటన్న విషయంపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాహుబలి తర్వాత అనుష్క చేతిలో ఉన్న చిత్రం భాగమతి మాత్రమే. ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడో అనే విషయంపై ఉలుకు పలుకు లేదు. బాహుబలి తర్వాత బాగా లావై పోయిన అనుష్క భాగమతి చిత్రంలో అలానే నటించింది. అయితే ఆమె షేప్‌ను తగ్గించడానికి గ్రాఫిక్స్‌ను ఎక్కువగా వాడుతున్నారట. గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమా లేట్ అవుతున్నదనే మాట వినిపిస్తున్నది.