డ్రైవర్‌కి 12 లక్షల కారు గిఫ్టుగా ఇచ్చిన అనుష్క!
హైదరాబాద్: హీరోయిన్ అనుష్క తన సహచరులకు, తన దగ్గర పని చేసే వారికి మంచి మంచి గిఫ్టులు ఇస్తుందనే పేరుంది. తాజాగా అనుష్క తన డ్రైవర్‌కు భారీ గిఫ్టు ఇవ్వబోతోందట. తన కారు నడిపే సదరు డ్రైవర్‌కి ఏకంగా మరో కారును గిఫ్టుగా ఇవ్వబతోంది. సదరు కారు విలువ రూ. 10 నుంచి 12 లక్షల మధ్య ఉంటుందని అంటున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ...ముందుగా కమిట్ కావడం వల్లనే డ్రైవర్‌కి కారు కొనిస్తోందని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అనుష్క తమిళంలో ఆర్య హీరోగా రూపొందుతున్న 'ఇరండం ఉళగం' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతోంది. మరో వైపు ఆమె నటించిన పలు భారీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. నాగార్జునతో కలిసి నటించిన 'డమరుకం' చిత్రం అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటరీ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని రూపొందించారు.
ఇక అనుష్క విక్రమ్‌తో కలిసి నటించిన 'శివ తాండవం' సెప్టెంబర్ 28న విడుదల కానుంది. 'శివ తాండవం' చిత్రానికి ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. యు.టి. వి.మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రోనీ స్ర్కూవాలా, సిద్ధార్థరాయ్‌కపూర్ నిర్మాతలు. అనుష్క, లక్ష్మీరాయ్, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.
అనుష్క సినిమాలు విడుదలై చాలా కాలమైంది. దీంతో ఆమె అందాలను ఎప్పుడెప్పుడు తెరపై చూసి కన్నుల విందు చేసుకుందామా అని అభిమానులు ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











