»   » బాహుబలి : అనుష్క రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బాహుబలి : అనుష్క రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి'. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు రూ. 250 కోట్లు. మరి సినిమాకు ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే అందులో నటించే స్టార్ల రెమ్యూనరేషన్ కూడా అదే రేంజిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే తారగా పేరొందిన అనుష్క ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె కత్తి యుద్ధంతో పాటు పలు యాక్షన్ సీన్లు కూడా చేసింది. ఈ అదనపు శ్రమకు తోడు అనుష్క డేట్స్ కూడా భారీగానే కేటాయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఎంత రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందనేది హాట్ టాపిక్ అయింది.


Anushka Shetty remuneration for Baahubali

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క ఈ మొత్తం ప్రాజెక్టుకు గాను రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. జులై 10న విడుదల కాబోయే మొదటి భాగం ‘బాహుబలి- ది బిగినింగ్' చిత్రంలో అనుష్క పాత్ర నిడివి తక్కువే. ఇందులో ఆమె చరసాల పాలైన దేవసేన పాత్రలో ఆమె నటిస్తోంది.


అయితే వచ్చే ఏడాది విడుదల కాబోయే బాహుబలి పార్ట్-2 లో మాత్రం అనుష్క పూర్తి స్థాయి పాత్రలో.....కింగ్ అమరేంద్ర బాహుబలి సతీమణి, మహారాణి దేవసేనగా కనిపించబోతోంది. అనుష్క రెమ్యూనరేషనే ఇంత ఉందంటే సినిమాలో కీలక పాత్రధారులైన ప్రభాస్, రానా రెమ్యూనరేషన్, రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో?

English summary
SS Rajamouli’s Baahubali is one of the costliest films in Indian cinema. According to the industry talk, Anushka’s remuneration is Rs 4 Crore for her role in this magnum opus project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu