అతడితో ప్రేమలో పడ్డాను.. అప్పట్లో రిలేషన్ కొనసాగింది.. అందుకే బ్రేకప్ చెప్పా.. అనుష్క
బాహుబలి మూవీ తర్వాత సినీ తార అనుష్క పెళ్లి వార్తలు జోరందుకొన్నాయి. ప్రభాస్‌తో ప్రేమ, పెళ్లి అంటూ ఊహాగానాలు ఉవ్వెత్తున మీడియాలో ఎగిసిపడ్డాయి. ఏదో సందర్భం దొరికితే చాలూ.. అనుష్క పెళ్లి వార్తకు మీడియాలో అత్యంత ప్రాధాన్యం దక్కుతుంది. ఇటీవల తన 15 సంవత్సరాల సినీ కెరీర్ సందర్భంగా జరిగిన వేడుకలో పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న నన్ను వెంటాడుతున్నది అంటూ కొంత క్లారిటీ ఇచ్చింది జేజమ్మ.. అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించి మరింత ఆసక్తిని రేపింది. తాజా ఇంటర్వ్యూలో...

అతడితో రిలేషన్‌షిప్
కొద్ది సంవత్సరాల క్రితం ఒక హీరోతో రిలేషన్‌షిప్‌ను కొనసాగించాను. అతడి పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు. అతడితో నా ప్రేమబంధం హ్యాపీగా కొనసాగింది. మా రిలేషన్ మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పగలను. 2008లో మా బంధం చాలా ఆరోగ్యంగా ఉండేది అని అనుష్క చెప్పుకొచ్చింది.

అలా బ్రేకప్ చెప్పాం
ఆ వ్యక్తితో ఇప్పుడు ఆ రిలేషన్‌షిప్ లేదు. పరస్పర అవగాహనతో మేము విడిపోవాలని అనుకొన్నాం. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకొని ఆ బంధానికి బ్రేకప్ చెప్పాం. అతడి పేరు నేను చెప్పడం బాగుండదు. అతడి గురించి చెబితే మా మధ్య ఇప్పటికి ఉన్న బంధంపై ప్రభావం పడుతుంది. అతడితో నా బంధం చాలా వ్యక్తిగతం అని అనుష్క చెప్పింది.

విడిపోయానా కలిసి ఉంటున్నాం
అతడితో విడిపోయినా మేము ఒకరినిమరోకరం గౌరవించుకొంటాం. మా మధ్య మంచి రిలేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బ్రేకప్ అంటే కొట్టుకొని, తిట్టుకొని విడిపోయిన సందర్భాలు మా బ్రేకప్‌లో కనిపించవు. మా మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వచ్చాయి. అవి పెద్దగా కాకుండదనే విషయంతో మేమిద్దరం పరస్పరం ఆలోచించుకొని విడిపోయాం అని చెప్పారు.
Recommended Video

నా పెళ్లి విషయం తల్లిదండ్రులకే
నా పెళ్లి అనేది ఎప్పుడు జరుగుతుందనే చెప్పలేను. అది నా తల్లిదండ్రులు నిర్ణయానికే వదిలేశాను. వారి నిర్ణయమే నా నిర్ణయం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా నేను ఒకే చెబుతాను అని అనుష్క చెప్పారు. తాజాగా ఆమె నటించిన నిశ్శబ్దం చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల నటించారు.


Click it and Unblock the Notifications











