అతడంటే పిచ్చి, ప్రేమించా.... ఆసక్తికర విషయం చెప్పిన అనుష్క!
ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా’ అని అనుష్క వెల్లడించారు.
Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.... వయసు 36. అమ్మడుకి ఇంత వయసొచ్చినా పెళ్లికి మాత్రం నో అంటోంది. ఇంకా సినిమాల మీద సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. అనుష్క త్వరలో 'భాగమతి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నే సంగతి తెలిసిందే.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ అనుష్క తన సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు చెప్పింది. టీనేజ్‌లో ఉన్నపుడు సినిమా స్టార్లు, క్రికెటర్ల మీద ఎఫెక్షన్ పెంచుకోవడం సహజం, తను కూడా స్టార్ క్రికెటర్‌ను ప్రేమించానని తెలిపింది.

అతడంటే నాకు పిచ్చి
‘రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా' అని అనుష్క వెల్లడించారు.

ప్రస్తుతం ఎవరి ప్రేమలో లేను
ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, పెళ్లి గురించి ఆలోచించే సమయం కూడా లేదని అనుష్క పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని అనుష్క తెలిపారు.

భాగమతి
ప్రస్తుతం అనుష్క ‘భాగమతి' అనే చిత్రంలో నటిస్తున్నారు. పిల్లజమిందార్ ఫేం అశోక్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్ నటిస్తున్నారు.

థ్రిల్లర్ మూవీ
‘భాగమతి' డిఫరెంట్ కాన్సెప్ట్ తో .. థ్రిల్లింగ్ గా అనిపించే స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుందని, అనుష్క నటనలోని మరో కోణాన్ని ఇందులో చూస్తారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతీ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటాయని దర్శక నిర్మాతలు అంటున్నారు.


Click it and Unblock the Notifications











