twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వల్ల కాదు, సినిమాల్లో అలాంటి ప్రయత్నం చేయను: అనుష్క

    By Bojja Kumar
    |

    అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి.... లాంటి భారీ హిట్ చిత్రాలతో పాటు అనేక సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి సౌత్‌లో సూపర్ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అనుష్క శెట్టి. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు దాటింది. తన కోరీర్లో దాదాపు అన్ని రకాల పాత్రలు చేసింది. అయితే ఇన్నేళ్లయినా అనుష్క ఒకటి మాత్రం ప్రయత్నించలేదు. ఆమెకు తెలుగు మాట్లాడటం వచ్చినా తన పాత్రకు సొంత డబ్బింగ్ ఇప్పటి వరకు చెప్పుకోలేదు. ఇందుకు గల కారణం అనుష్క వివరించారు.

    అందుకే నేను డబ్బింగ్ చెప్పను

    అందుకే నేను డబ్బింగ్ చెప్పను

    నా గొంతు చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఉంటుంది. వాయిస్ కూడా చాలా ‘లో'గా ఉంటుంది, ఒక్కోసారి నేను మాట్లాడేది పక్కన వ్యక్తికి కూడా వినిపించదని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెబుతుంటారు..... ఇలాంటి గొంతు సినిమాలకు పనికి కాదు కాబట్టే తాను ఇప్పటి వరకు డబ్బింగ్ చెప్పలేదని అనుష్క తెలిపారు.

    పాత్ర మీద ఎఫెక్ట్ పడుతుంది

    పాత్ర మీద ఎఫెక్ట్ పడుతుంది

    సినిమాలో ఏ పాత్ర అయినా గాత్రం అనేది చాలా ముఖ్యం. దాని ఆధారంగానే పాత్ర హైలెట్ అవుతుంది. నాకు వాయిస్ అందుకు సూట్ కానపుడు డబ్బింగ్‌ చెబితే పాత్ర మీద ఎఫెక్ట్ పడుతుంది, పాత్ర ప్రాధాన్యం దెబ్బతింటుంది అని అనుష్క తెలిపారు.

    అరుంధతిలో...భాగమతిలో

    అరుంధతిలో...భాగమతిలో

    నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అరుంధతి. ఈ చిత్రంలో ‘నువ్వు నన్నేం చేయలేవురా' అనే డైలాగులో స్వరం అనేది ఎంతో ముఖ్యం. ఆ స్థాయిలో స్వరం రాక పోతే ఆ సన్నివేశం పండదు. ఆ డైలాగ్ నేను ఇంట్లో చాలా సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాను. ‘భాగమతి' చిత్రంలో ‘ఇది భాగమతి అడ్డా' కూడా కూడా అలాంటిదే. నా గొంతుతో ఆ స్థాయిలో వాటిని పిలించలేను కాబట్టే డబ్బింగ్ చెప్పను అని అనుష్క తెలిపారు.

    డబ్బింగ్ ప్రయత్నించే ఉద్దేశ్యం కూడా లేదు

    డబ్బింగ్ ప్రయత్నించే ఉద్దేశ్యం కూడా లేదు

    నా గొంతు డబ్బింగ్ చెప్పడానికి అనుగుణంగా ఉండదు కాబట్టి అలాంటి ప్రయత్నం చేసే ఉద్దేశ్యం కూడా లేదు.... అని అనుష్క శెట్టి తెలిపారు.

    ఏ సినిమాకూ కమిట్ కాని అనుష్క

    ఏ సినిమాకూ కమిట్ కాని అనుష్క

    ‘భాగమతి' తర్వాత అనుష్క ఇంకా ఏ సినిమా కమిట్ కాలేదు. ప్రస్తుతం ఆమె ‘భాగమతి' చిత్రం సక్సెస్‌ ఎంజాయ్ చేస్తున్నారు. యూవి క్రియేషన్స్ నిర్మాణంలో అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

    English summary
    Actress Anushka says, “My voice is sweet and it’s like a child’s voice. It won’t suit my characters, which are mostly loud. If you look at the roles I’ve played recently, even Bhaagamathie, they need heavy voices.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X