రంగస్థలంని ఢీ కొట్టి తొలి స్థానంలో భాగమతి.. టాలీవుడ్‌కు దరిద్రమైన రికార్డు, 8వ స్థానంలో అజ్ఞాతవాసి!

Recommended Video

Bhaagamathie Is The Most Downloaded Movie Than Rangasthalam

రంగస్థలం చిత్రాన్ని అనుష్క భాగమతి చిత్రం అధికమించింది. మీరు వింటున్నది నిజమే. కానీ ఇది మంచి రికార్డు కాదు. ఛండాలమైన రికార్డు ఇది. ఇంతకీ ఆ రికార్డు ఏ విషయంలో అనుకుంటున్నారా.. పైరసీలో. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఎక్కువ మంది పైరసీలో చూసిన చిత్రంగా భాగమతి రికార్డు సృష్టించింది. ఆ తరువాత స్థానంలో రాంచరణ్ రంగస్థలం నిలిచింది. జర్మనీకి చెందిన తెసీక్సిపికో అనే సంస్థ తెలుగులో ఎక్కువగా పైరసీ బారిన పడ్డ చిత్రాల జాబితా విడుదల చేసింది. తొలి పది స్థానాలని ఆక్రమించిన తెలుగు చిత్రాలు.. ఎంత మంది వాటిని పైరసీలో చూశారు తదితర వివరాలు ఇవే..

భాగమతి

భాగమతి

అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. మరోమారు అనుష్క నట విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం ఇది. భాగమతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని పైరసీ రూపంలో 1.9 మిలియన్ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది పైరసీలో భాగమతిదే అగ్రస్థానం.

రంగస్థలం

రంగస్థలం


రాంచరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. సమ్మర్ లో విడుదలైన రంగస్థలం చిత్రం బాహుబలి తరువాత అంత పెద్ద విజయంగా నిలిచింది. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పైరసీలో ఈ చిత్రం భాగమతి తరువాత రెండవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రాన్ని 1.6 మిలియన్ మంది పైరసీలో డౌన్ లోడ్ చేసుకున్నారు.

భరత్ అనే నేను

భరత్ అనే నేను

కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ సూపర్ హిట్ కాంబోలో వచ్చిన రెండవ చిత్రం ఇది. భరత్ అనే నేను చిత్రం అంచనాలని అందుకుని మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి కూడా 1.6 మిలియన్స్ డౌన్ లోడ్స్ పైరసీలో వచ్చాయి.

 మహానటి

మహానటి

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని కూడా పైరసీ భూతం వదల్లేదు. మహానటి చిత్రాన్ని పైరసీలో 1. 4 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

నా పేరు సూర్య

నా పేరు సూర్య

రచయిత వక్కంతం వంశి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఆర్మీ అధికారిగా కనిపించాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ చిత్రానికి 1.2 మిలియన్ డౌన్ లోడ్స్ పైరసీలో జరిగాయి.

తొలిప్రేమ

తొలిప్రేమ

వరుణ్ తేజ్ కెరీర్ లో వరుసగా రెండవ విజయం సాధించిన చిత్రం ఇది. కూల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన తొలిప్రేమ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి పైరసీ డౌన్ లోడ్స్ 1 మిలియన్.

ఛలో

ఛలో

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో చిత్రం మంచి వినోదాత్మకభరిత చిత్రంగా విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. 8 లక్షలకు పైగా ఈ చిత్రాన్ని పైరసీలో డౌన్ లోడ్ చేసుకున్నారు.

అజ్ఞాతవాసి

అజ్ఞాతవాసి

ఈ ఏడాది బిగ్గెస్ట్ డిసప్పాయింట్ మెంట్ గా నిలిచిన చిత్రం అజ్ఞాతవాసి. త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం ఇది. ఈ చిత్రానికి కూడా 8 లక్షల పైరసీ డౌన్ లోడ్స్ వచ్చాయి.

జై సింహా

జై సింహా

సంక్రాంతికి విడుదలైన బాలయ్య జై సింహా చిత్రాన్ని తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. జైసింహా చిత్రానికి కూడా 8 లక్షలకు పైగా పైరసీ డౌన్ లోడ్స్ రావడం విశేషం.

 టచ్ చేసి చూడు

టచ్ చేసి చూడు

మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులముందుకు వచ్చిన రవితేజ టచ్ చేసి చూడు చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ చిత్రాన్ని 7 లక్షల మంది పైరసీలో డౌన్ లోడ్ చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X