పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అనుష్క మేనేజర్
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్, సౌతిండియా సెక్సీ బ్యూటీ అనుష్క ‘బాహుబలి' సినిమా తర్వాత హీరోయిన్ అనుష్క పెళ్లి చేసుకోబోతోంది, ఆమె ఓ ప్రముఖ బిజినెస్ మేన్‌ను పెళ్లాడబోతోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను అనుష్క మేనేజర్ ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని తెలిపారు.
‘బాహుబలి' తర్వాత ఆమె ‘భాగమతి' అనే మరో సినిమాలో కూడా నటించబోతోందని అనుష్క మేనేజర్ చెప్పుకొచ్చారు. ‘భాగమతి' సినిమాకు ఆమె కొన్ని నెలల క్రితమే సైన్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అనుష్క ‘లింగా' షూటింగులో బిజీగా ఉందని, ఆమె చేయాల్సిన ప్రాజెక్టులు కూడా ఉన్నందున కొత్త ప్రాజెక్టులు ఏమీ ఒప్పుకోవడం లేదని, అంతకు మించి ఏమీ లేదన్నారు.

అనుష్క నటించిన తమిళ అనువాద మూవీ ‘వర్ణ' తర్వాత ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. దీని తర్వాత ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి' చిత్రంలో టైటిల్ రోల్ చేసింది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో తెలుగు మూవీ ‘బాహుబలి' చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. రజనీకాంత్ సరసన ఆమె నటిస్తున్న ‘లింగా' చిత్రం కూడా తెలుగులో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











