రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో అనుష్క సినిమా.. నిర్మాతలు షాకింగ్ నిర్ణయం
లాక్‌డౌన్ సమయంలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేస్తున్నారనే వార్తలు రెండు వారాలుగా నెట్లో స్వైర విహారం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం టాలీవుడ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..
Recommended Video

లాక్‌డౌన్‌తో సినిమా రిలీజ్ వాయిదా
భాగమతి తర్వాత అనుష్క శెట్టి నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలో రూపొందించారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని భావించారు. అయితే కరోనావైరస్ కారణంగా థియేటర్లలో మూసి వేయడం, ప్రదర్శనలు నిలిపివేయడంతో నిర్మాతలకు షాక్ తగిలింది.

మరో నెలలు రిలీజ్ లేదని
తాజాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 4.0కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. తాజాగా మరో నెలలు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల రిలీజ్ ఉండబోదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేయడంతో తెలుగు సినిమా నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లపై రిలీజ్ చేయాలనే ఆలోచనలతో ముందుకు పోతున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా
తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల క్రమంలోనే సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ సినిమాను జూన్‌లో అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

26 కోట్లకు డిజిటల్ హక్కులు
అనుష్క శెట్టికి ఉన్న మార్కెట్ దృష్ట్యా రికార్డు ధరకు డిజిటల్ హక్కులు అమ్ముడుపోయినట్టు సమాచారం. అన్ని భాషలకు సంబంధించిన హక్కుల బిజినెస్ రూ.26 కోట్ల మేర జరిగిందనేది తాజా సమాచారం. ఈ రిలీజ్ విషయం అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించాల్సిన అవసరం ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది.


Click it and Unblock the Notifications











