అనుష్కకు తీరిన కష్టాలు.. సైలెంట్‌గా అమెరికాకు..

బాహుబలి, భాగమతి విజయాల తర్వాత అనుష్క శెట్టి సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. భాగమతి రిలీజై ఏడాదిన్నర కావోస్తున్నా.. మరో సినిమా పట్టాలెక్కలేదు. తాజాగా సైలెన్స్ అనే చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రధాన భాగం అమెరికాలో జరుగుతుంది. అందుకోసం సినిమా యూనిట్ యూఎస్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. కానీ అనుష్కశెట్టికి వీసా సమస్యలు ఎదురు కావడంతో షూటింగ్ షెడ్యూల్‌ను వాయిదా వేశారు. వాస్తవానికి ఫిబ్రవరిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సింది.

ప్రస్తుతం అమెరికా వీసాకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినం అయ్యాయి. దాంతో అచితూచీ అధికారులు నిర్ణయం తీసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క ఓ1 వీసాను దరఖాస్తు చేసుకొన్నది. సాధారణంగా కళలు, క్రీడలు, శాస్త్రవేత్తలకు సంబంధించిన వ్యక్తులకు ఈ వీసాను జారీ చేస్తారు. తాజాగా ఈ వీసా నిబంధనల్లో మార్పులు వల్ల అనుష్క వీసా ఆలస్యమైందట. ఇప్పుడు అనుష్క వీసాకు ఆమోదం లభించడంతో షూటింగ్‌కు క్లియరెన్స్ లభించింది.

Anushka Shettys Visa Issues resolved

ప్రస్తుతం అనుష్క శెట్టి వీసా సమస్యలు తీరిపోవడం, ఆమెకు ఎంబసీ నుంచి క్లియరెన్స్ రావడంతో మళ్లీ షూటింగ్ ఏర్పాట్లు ఊపుందుకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ను మే రెండోవారం ప్రారంభించాలని యూనిట్ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. దాంతో అనుష్క త్వరలోనే అమెరికాకు వెళ్లి షూటింగ్‌లో పాల్గొంటారనేది తాజా సమాచారం.

హీరో మాధవన్ నటిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ నిర్మాతగా, రచయితగా వ్యవహరిస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్‌సన్ తీసుకొన్నారు. మైఖేల్ కిల్ బిల్ లాంటి చిత్రాలతో భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితులు. ఇంకా ఈ చిత్రంలో సుబ్బరాజు, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X