ప్రభాస్‌తో పెళ్లి.. మరోసారి అనుష్క క్లారిటీ .. పూరీ జగన్నాథ్ సలహాతోనే మారిపోయా!

By Rajababu

Recommended Video

ప్రభాస్‌తో పెళ్లి.. పూరీ జగన్నాథ్ సలహాతోనే మారిపోయా!

బాహుబలి2 తర్వాత ప్రభాస్, అనుష్క శెట్టి రిలేషన్స్‌పై ఎన్నో రూమర్లు, గాసిప్స్ వచ్చాయి. అయితే వాటిపై అప్పుడో ఇప్పుడో వారిద్దరూ స్పందిస్తూనే ఉన్నారు. కానీ ఆ రూమర్లకు ఎలాంటి తెరపడలేదు కదా.. కొత్తకొత్తగా కథనాలు మీడియాలో వచ్చాయి. తాజాగా భాగమతి సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ అనుష్క తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెల్లడించారు. అవేమిటంటే..

 ప్రభాస్‌తో పెళ్లి వార్తల గురించి

ప్రభాస్‌తో పెళ్లి వార్తల గురించి

ప్రభాస్‌తో నాకు సన్నిహితమైన రిలేషన్స్ ఉన్నాయి. మేమిద్దరం మంచి స్నేహితులం. అంతకంటే మా మధ్య ఎలాంటి రిలేషన్స్ లేవు. మేము పెళ్లి చేసుకొంటున్నామనే వార్తలు అవాస్తవం అని అనుష్క వెల్లడించింది.

జాతీయ అవార్డు రాకపోవడంపై

జాతీయ అవార్డు రాకపోవడంపై

బాహుబలి చిత్రానికి జాతీయ అవార్డు రాకపోవడంపై ఎలాంటి బాధలేదు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందాయి. అదే నాకు పెద్ద అవార్డు. మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా అభిలాష.

రజనీకాంత్ రాజకీయాలపై

రజనీకాంత్ రాజకీయాలపై

తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రజనీకాంత్‌ తరఫున తాను ప్రచారం చేస్తానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. రజనీ సార్ నన్ను ఇంత వరకు అడగలేదు. రాజకీయాల్లంటే నాకు ఆసక్తి లేదు. రజనీకాంత్ సార్ అడిగితే అప్పుడు ఆలోచిస్తాను అని అనుష్క చెప్పింది.

 భాగమతి చిత్రంలో

భాగమతి చిత్రంలో

భాగమతి చిత్రం దెయ్యం కథ, పునర్జన్మతో కథతో రూపొందించిన చిత్రమని తప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఆ చిత్రం సమకాలీన అంశాలతో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం. నేను ఆ చిత్రంలో సంజనా అనే ఓ ఐఏఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. ఆ పాత్ర అంతా కల్పితమైనదే. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోల్చితే చాలా విభిన్నమైనది.

భాగమతి చిత్రంలో డబుల్ రోల్

భాగమతి చిత్రంలో డబుల్ రోల్

భాగమతి చిత్రంలో నాది ద్విపాత్రాభినయం కాదు. కానీ నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అభినయానికి ఎంతో స్కోప్ ఉన్న పాత్రకు రూపకల్పన చేసిన దర్శకుడు అశోక్ గారికి ధన్యవాదాలు. 2012లోనే ఈ చిత్ర కథను నా ముందుకు తీసుకొచ్చారు అని అనుష్క పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ్ సలహాతోనే

పూరీ జగన్నాథ్ సలహాతోనే

సినిమా పరిశ్రమలోకి కొత్తగా ప్రవేశించిన సమయంలో నేను కథలు వినేదానిని కాదు. ఆ తర్వాత ఓ సందర్భంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు. నీవు నటించే సినిమా కథ, పాత్ర గురించి తెలుసుకోకుండా సినిమాలు చేయకు అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నేను నటించే పాత్ర, సినిమా గురించి ఖచ్చితంగా తెలుసుకొంటున్నాను.

 నాకు నేనే పోటీ

నాకు నేనే పోటీ

సినిమా పరిశ్రమలో నాకు ఎవరు పోటీలేరు. నేను ఎవరికి పోటీ కాను. నాకు నేనే పోటి అని భావిస్తాను. షూటింగ్‌లు లేని సమయంలో ఇంట్లోనే ఉంటాను. ఇంటిపట్టునే ఉండి రిలాక్స్ అవుతాను. నేను పార్టీలకు ఎక్కువగా హాజరుకాను అని అనుష్క చెప్పారు.

 ముందు నుంచే రానాతో పరిచయం

ముందు నుంచే రానాతో పరిచయం

సినిమా పరిశ్రమలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అక్కినేని, చిరంజీవి ఫ్యామిలీలో చాలా మంది నాతో సన్నిహితంగా ఉంటారు. సినిమాల్లోకి రాకముందే రానా దగ్గుబాటి నాకు మంచి స్నేహితుడు. యోగా క్లాసులు నిర్వహించే సమయంలో నాకు సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది పరిచయం అని అనుష్క అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X