»   » ‘సాహో’: అనుష్కనే నో చెప్పిందట, కారణాలు ఇవే...

‘సాహో’: అనుష్కనే నో చెప్పిందట, కారణాలు ఇవే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో ప్రభాస్‌కు తగిన స్క్రీన్ జోడి ఎవరు అంటే అందరూ ముందుగా చెప్పేది అనుష్క పేరే. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి' పెద్ద హిట్. ఆ తర్వాత వచ్చిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న 'సాహో' సినిమాలో కూడా అనుష్కనే హీరోయిన్ అని అంతా ఊహించారు. 'సాహో' మేకర్స్ కూడా ముందు అనుష్కను తీసుకోవడానికే ప్రయత్నాలు చేశారు. అయితే చివరకు ఈ సినిమాలో అనుష్క చేయడం లేదని తేలిపోయింది. దీనిపై అనేక కారణాలు వినిపిస్తూనే ఉన్నాయి.

నో చెప్పి తప్పుకున్న అనుష్క

నో చెప్పి తప్పుకున్న అనుష్క

అనుష్క బరువు పెరగడం వల్లనే ఆమెను పక్కన పెట్టినట్లు కొన్ని రోజులు క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం.... అనుష్కను సాహో మేకర్స్ పక్కన పెట్టలేదని, పలు కారణాలతో అనుష్కనే ఈ సినిమా చేయడానికి నో చెప్పిందని తెలుస్తోంది.

Prabhas playing Guest Role in Tamannaah's Khamoshi | Filmibeat Telugu
రెండు నెలల సమయం అడిగిన అనుష్క

రెండు నెలల సమయం అడిగిన అనుష్క

సాహో సినిమాలో నటించడానికి తనకు రెండు నెలల సమయం కావాలని, అప్పటి వరకు తాను డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని అనుష్క చెప్పిందట.

అనుష్క కమిట్మెంట్స్

అనుష్క కమిట్మెంట్స్

సాహో మేకర్స్ తనను సంప్రదించడానికి ముందే అనుష్క కొన్ని తమిళ ప్రాజెక్టులకు కమిటైంది. దీంతో ముందు వారికి కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి వాటికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పిందట.

డేట్స్ క్లాస్

డేట్స్ క్లాస్

‘సాహో' చిత్ర యూనిట్ అడిగిన డేట్స్, తాను కమిటైన తమిళ మూవీ డేట్స్ క్లాస్ అయ్యేలా ఉండటంతో ఏమీ చేయలేని స్థితిలో తానే తప్పుకుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

డిసప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్

డిసప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్

ప్రభాస్-అనుష్క వండర్‌ఫుల్ పెయిర్. ఈ జంటను అభిమానులు కూడా ఎంతో ప్రేమించారు. వీరిద్దరు పెళ్ళి చేసుకుంటే బావుంటుందని కొందరు ఆశ పడ్డారు. ఆ మధ్య వచ్చిన వార్తలు కూడా వీరు ఇలా ఆశ పడటానికి కారణం. అయితే ప్రభాస్-అనుష్క పెళ్లి వార్తలు నిజం కాదని తేలడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి.

సాహో మూవీ న్యూ అప్డేట్

సాహో మూవీ న్యూ అప్డేట్

ఓ బాలీవుడ్ పత్రిక కథనం ప్రకారం.... బాలీవుడ్ నటుడు చుంకీ పాండే సాహో సినిమాలో కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.

చుంకీ పాండే

చుంకీ పాండే

చుంకీ పాడేకు సాహో స్క్రిప్టు చాలా నచ్చిందని, అందులో తన పాత్ర కీలకంగా ఉండటంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

హాలీవుడ్ నుండి స్టంట్ డైరెక్టర్

హాలీవుడ్ నుండి స్టంట్ డైరెక్టర్

ప్రభాస్ సాహో మూవీని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్‌ను రప్పిస్తున్నారు.

English summary
Prabhas and Anushka Shetty's romance in Baahubali was a treat to the eyes. They looked magical together in the magnum opus. Their fans (including us) were hoping that the two will set the screen on fire once again in Saaho. But it seems that we won't be able to witness that romantic chemistry anymore! According to Deccan Chronicle, Anushka Shetty has said no to Prabhas' Saaho and the reason is really disappointing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu