ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై అనుష్క షాకింగ్ రియాక్షన్.. రెస్పెక్ట్ పెరగాలంటే అలా చేయాల్సిందే!
సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనేది ఇపటిమాట కాదు. గత కొన్నేళ్లుగా ఈ అంశం నిత్యం వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. దీనిపై ఒక్కో హీరోయిన్ ఒక్కోలా స్పందిస్తోంది. తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క కూడా రియాక్ట్ అవుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే

సూపర్ బ్యూటీ.. వరల్డ్ స్టార్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'సూపర్' సినిమాతో సినీ గడపతొక్కిన అనుష్క.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేస్తూ ఫుల్ జోష్ కొనసాగించింది. అరుంధతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సత్తా చాటి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక బాహుబలి సిరీస్ ఆమెను వరల్డ్ స్టార్ చేసింది.

కొంత గ్యాప్.. అనుష్క నిశ్శబ్దం
ఈ మధ్యకాలంలో సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న అనుష్క.. తిరిగి ముఖానికి రంగేసుకుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ‘నిశ్శబ్దం' సినిమాలో అనుష్క నటించింది. ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటిస్తుండగా.. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాలతో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అనుష్క సందడి.. క్యాస్టింగ్ కౌచ్‌పై రియాక్షన్
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ 'నిశ్శబ్దం' మూవీ ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనుష్క పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. ఏప్రిల్ 2 న ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా క్యాష్, ఇతర టీవీ ప్రోగ్రామ్స్‌లో సందడి చేస్తున్న అనుష్క.. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది.

లైంగిక వేధింపులు లేవని చెప్పను.. అది వారి ఛాయిస్!
''ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవని నేను అనను కానీ నాకైతే ఎదురు కాలేదు అని పేర్కొంది అనుష్క. అయినా ఓ మహిళ నుండి ఇలాంటి వాటిని ఆశించడం తప్పు. ఇకపోతే కొందరు ఇష్టం ఉండి చేస్తున్నారు అంటే అది వారి ఛాయిస్. కానీ మన నుండి ఎదుటివాడు ఆశించిన దానికి ఎప్పుడైతే మహిళ నో అని చెబుతుందో అప్పుడే ఆమెకు రెస్పెక్ట్ వస్తుంది'' అని అనుష్క తెలిపింది.
Recommended Video

ముక్కుసూటిగా ఉంటా.. అందుకే
తానెప్పుడూ ముక్కుసూటిగా ఉంటా కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని అనుష్క చెప్పుకొచ్చింది. అలాగే తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ అన్నింటినీ ఖండించింది అనుష్క. ఈ సంగతులు పక్కనబెడితే తిరిగి అనుష్క చేస్తున్న హంగామా చూసి ఫిదా అవుతోంది టాలీవుడ్ లోకం.


Click it and Unblock the Notifications











