అనుష్క గ్లామర్‌కు తోడు....సెగలు రేపే సెక్స్ బాంబులు!
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ అనుష్క ప్రధాన పాత్రలో 'రుద్రమదేవి' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ చేస్తుండగా.....తాజాగా హాట్ అండ్ సెక్సీ ఐటం లేడీస్ హంసా నందిని, నథాలియా కౌర్‌లను కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు గుణశేఖర్.
13వ శతాబ్దానికి చెందిన కాకతీయ సామ్రాజ్య నేపథ్యాన్ని బేస్ చేసుకుని రుద్రమదేవి సాహసాలను ఈచిత్రంలో చూపెట్టనున్నారు. అయితే చరిత్రలో రుద్రమదేవికి సిస్టర్స్ ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. కానీ మేకర్స్ జరిపిన పరిశోధనలో మాత్రం ఆమెకు అనంబిక, మదనిక అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉన్నట్లు తేలిందట.
ఈ రెండు పాత్రల కోసం దాదాపు 20 మంది హీరోయిన్లను ఆడిషన్ చేసిన గుణ శేఖర్ చివరగా నథాలియా కౌర్, హంసా నందిని ఎంపిక చేసారు. ఇంతకాల ఐటం సాంగులకు మాత్రమే పరిమితమైన ఈ హాట్ అండ్ సెక్సీ ఐటం బాంబులు, రుద్రమదేవి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో అవకాశం రావడంతో సంతోషంగా ఫీలవుతున్నారు.
కేవలం అందాల ఆరబోత తప్ప....నటన పరంగా పెద్దమార్కులు పడని వీరిని గుణశేఖర్ ఏవిధంగా తన సినిమాలో ఉపయోగించుకుంటాడో చూడాలి. అయితే వీరిని గ్లామర్ పెర్ఫార్మెన్స్ కోసమే తీసుకున్నారనే అనుమానాలు సైతం ఉన్నాయి. సినిమా విడుదలైతేగానీ వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయం చెప్పలేం.
ఏప్రిల్ 18 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే 11 భారీ సెట్లను ఈ చిత్రం కోసం నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.


Click it and Unblock the Notifications












