అనుష్క నిజంగా సైజ్ జీరో.. ఆంటీ నుంచి అమ్మాయిలా మారిన దేవసేన..

బాహుబలి చిత్రంలో దేవసేనగా అనుష్క ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నారు. ఈ చిత్రం తర్వాత అనుష్క కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది అని అందరు అనుకొన్నారు.

By Rajababu

Recommended Video

వావ్..అనుష్క ఎంత స్లిమ్ అయిందో చూడండి !

బాహుబలి చిత్రంలో దేవసేనగా అనుష్క ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నారు. ఈ చిత్రం తర్వాత అనుష్క కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది అని అందరు అనుకొన్నారు. కానీ అందుకు భిన్నంగా దాదాపు కనుమరుగైపోయినంత ప్రమాదం ఏర్పడింది. అందుకు కారణం భారీగా లావెక్కడమే. కానీ మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పెట్టుకొనేందుకు గత కొద్దికాలంగా ప్రయత్నిస్తున్న అనుష్క తాజాగా ఓ ఫోటో పెట్టి షాకిచ్చింది.

సైజ్ జీరో కోసం అనుష్క శెట్టి

సైజ్ జీరో కోసం అనుష్క శెట్టి

తాము పోషించే పాత్రల కోసం నటీనటులు తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతుంటారు. కానీ అనుష్క మాత్రం అంతపని చేయకపోయినా తన దేహానికి అగ్ని పరీక్ష పెట్టింది. సైజ్ జీరో, బాహుబలి చిత్రం కోసం భారీగా తన ఆకారాన్ని పెంచుకొన్నారు అనుష్క. దాంతో బాహుబలి రిలీజ్ తర్వాత ఆమె ఆంటీలా కనిపించింది.

అనుష్కకు బరువు కష్టాలు

అనుష్కకు బరువు కష్టాలు

సైజ్‌జీరో చిత్రం కోసం లావెక్కడం అనుష్క‌ చాలా క‌ష్టాలు తెచ్చిపెట్టాయట. విపరీతంగా బ‌రువు పెరిగిన అనుష్క దాన్ని త‌గ్గించుకోవ‌డానికి నానా క‌ష్టాలు ప‌డింది. చివరకు అనుష్క‌ను స్లిమ్‌గా చూపించేందుకు `బాహుబ‌లి` టీమ్‌ గ్రాఫిక్స్‌ను ఆశ్ర‌యించ‌వ‌ల‌సి వ‌చ్చిందట.

సాహో నుంచి అనుష్క శెట్టి అవుట్

సాహో నుంచి అనుష్క శెట్టి అవుట్

బాహుబలి తర్వాత సాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని అనుష్క కొట్టేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ పక్కన డీ గ్లామర్‌గా అనుష్క కనిపించడంతో ఆమెను పక్కన పెట్టారని అప్పట్లో మీడియా కోడైకూసింది.

అనుష్క కోసం గ్రాఫిక్స్

అనుష్క కోసం గ్రాఫిక్స్

బాహుబలి తర్వాత అనుష్క చేతిలో ఉన్న సినిమా భాగ‌మ‌తి మాత్రమే. ఈ చిత్రంలో అనుష్కను సన్నగా చూపించేందుకు గ్రాఫిక్స్ వాడారు అని వార్తలు వచ్చాయి. దాదాపు గ్రాఫిక్స్ కోసం 5 కోట్లు ఖర్చు చేశారనేది అప్పట్లో టాక్.

వివాదంలో భాగమతి ఫస్ట్‌లుక్

వివాదంలో భాగమతి ఫస్ట్‌లుక్

ఇటీవల రిలీజ్ చేసిన భాగమతి ఫస్ట్‌లుక్ కూడా వివాదామైంది. భాగమతి ఫస్ట్‌లుక్‌లో ఉన్నది అనుష్క ఒరిజినల్ రూపం కాదు. ఆమెను గ్రాఫిక్స్ సన్నగా చెక్కేశారు అని మీడియాలో కథనాలు వచ్చాయి.

తాజాగా షాకిచ్చిన అనుష్క శెట్టి

ఇలాంటి నేప‌థ్యంలో అనుష్క త‌న ఫేస్‌బుక్ పేజీలో తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో పూర్తి కొత్త లుక్‌తో అనుష్క ద‌ర్శ‌న‌మిచ్చింది. చాలా స్లిమ్‌గా, బాబ్డ్ హెయిర్‌తో అనుష్క ఉంది. అంతేకాదు దాని కింద ఓ కామెంట్ కూడా అనుష్క పోస్ట్ చేసింది.

అనుష్క శెట్టి కొటేషన్ అదుర్స్

అనుష్క శెట్టి కొటేషన్ అదుర్స్

`క‌ల నిజ‌మ‌వ్వాలంటే మ్యాజిక్‌తో సాధ్యం కాదు. దాని కోసం తీవ్రంగా చమటోడ్చాలి. క‌ష్టించే తత్వం, కృత‌నిశ్చ‌యం ఉండాలి అని కామెంట్ రాసింది అని అనుష్క ఓ కొటేషన్ పెట్టింది. తాజా ఫొటోను చూస్తే కుర్ర హీరోయిన్లకు గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. మళ్లీ టాలీవుడ్‌లో తళుక్కున మెరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X