Anushka Shetty: అనుష్కకు వింత వ్యాధి.. ఆ సమయంలో అస్సలు కంట్రోల్ చేసుకోలేదట.. ఇది కూడా సమస్యేనా!
సాధారణంగా సినీ రంగంలో వరుసగా ఆఫర్లను అందుకోవడం చాలా కష్టం అనే చెప్పాలి. అలాంటిది దాదాపు పదేళ్ల పాటు ఎన్నో చిత్రాలు నటించడంతో పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటీ అనుష్క శెట్టి. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది.. తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా వెండితెరపై సందడి చేయడం లేదు. దీంతో ఆమె గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుష్క ఆరోగ్యంపై ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులు మీకోసం!

అలా ఎంట్రీ... వరుస ఆఫర్లు
అనుష్క శెట్టి 'సూపర్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో ప్రేక్షకులను, ఫిల్మ్ మేకర్లను ఆకట్టుకుని మరిన్ని ఆఫర్లను అందుకుంది. ఇలా తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపును కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు, భారీ అవకాశాలను సైతం దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది.

ఆ మూవీ టాప్.. వరల్డ్ రేంజ్
కెరీర్ ఆరంభంలోనే అనుష్క ఎన్నో మంచి అవకాశాలు దక్కించుకుంది. మొదట ఆమె గ్లామర్ పాత్రలకే పరిమితం అయినప్పటికీ.. ఆ తర్వాత పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటించింది. ఈ క్రమంలోనే 'అరుంధతి' అనే మూవీ ఆమెను టాప్‌లో నిలిపింది. అలాగే, 'బాహుబలి' సిరీస్‌తో అనుష్క రేంజ్ వరల్డ్ లెవెల్‌కు చేరుకుందన్న విషయం తెలిసిందే.

బెడిసి కొట్టిన కొత్త ప్రయోగం
'బాహుబలి' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అనుష్క 'సైజ్ జీరో' అనే సినిమాలో నటించింది. ఇందులో లావు ఉన్న అమ్మాయిగా కనిపించేందుకు ఆమె భారీగా బరువు పెరిగింది. అప్పటి నుంచి అనుష్కకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ మూవీ తర్వాత ఆమెకు ఆఫర్లు సన్నగిల్లాయి. ఫలితంగా గతంలో మాదిరిగా ఆమె సినిమాలను చేయట్లేదని చెప్పొచ్చు.

పెళ్లి వార్తలు.. ఆ సినిమాలో
అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న సమయంలోనే ఈమె పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ మధ్య కాలంలో ఇవి ఇంకాస్త ఎక్కువ అయ్యాయి. ఇక, అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిస్తోన్నారు. దీనికి 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

అనుష్క శెట్టికి వింత వ్యాధి
కెరీర్‌ను మొదలెట్టడానికి ముందు నుంచే యోగా టీచర్‌గా వ్యవహరించిన అనుష్క శెట్టి.. ఎంతో ఫిట్‌గా కనిపించేది. అయితే, లావు అయిన తర్వాత ఆమెకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక, ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోందని సంతోష పడుతోన్న ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిసింది. అదే.. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఓ వింత వ్యాధితో ఇబ్బంది పడుతుందట.

కంట్రోల్ అవడం లేదంటూ
తాజాగా అనుష్క శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన ఆరోగ్య సమస్యను బయట పెట్టింది. 'నాకు ఒక వింత సమస్య ఉంది. నవ్వడం మొదలుపెడితే దాదాపు 15 నుంచి 30 నిమిషాల పాటు నవ్వుని కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను. దీనివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాను' అని చెప్పుకొచ్చింది. దీంతో అసలు ఇది కూడా వ్యాధేనా అని అనుకుంటున్నారు.

అనుష్క సమస్య ఏంటంటే
అనుష్క బాధ పడుతోన్న ఆరోగ్య సమస్య పేరు 'సూడోబుల్బార్ ఎఫెక్ట్' అంటారని తెలిసింది. ఇది కొన్ని నాడీ సంబంధిత పరిస్థితులు లేదా గాయాలు ఉన్నవారిలో వస్తుందట. ఈ సమస్య ఉన్న వాళ్లు ఏదైనా భావోద్వేగాలకు గురైతే వెంటనే తేరుకోలేరట. దీనివల్లే అనుష్క నవ్వు కంట్రోల్ చేసుకోలేకపోతోందట. దీనిని మెడిటేషన్ వంటి వాటితో కంట్రోల్ చేసుకోవచ్చని తెలిసింది.


Click it and Unblock the Notifications











