ఎయిడ్స్ వ్యాధిపై హీరోయిన్ అనుష్క కూడా..!
హైదరాబాద్: హీరోయిన్ అనుష్క, హీరో సూర్య ఎయిడ్స్ వ్యాధిపై నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. 'టీచ్ ఎయిడ్స్' పేరుతో సాగే ప్రచార కార్యక్రమంలో చిన్న పిల్లల్లో ఈ వ్యాధి సంక్రమించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో శృతి హాసన్, సిద్ధార్థ కూడా భాగం కానున్నారు.
అనుష్క, ఇతర నటీనటులతో రూపొందించిన యానిమేటెడ్ అవేర్‌నెస్ వీడియోని ఇటీవల విడుదల చేసారు. ఇప్పటి వరకు ఎలాంటి సోషల్ అవేర్‌నెస్ కార్యక్రమంలో పాలు పంచుకోలేదని, ఒక మంచి ఉద్దేశ్యంతో జరుగుతున్న ఎయిడ్స్ వ్యాధి అవగాహన కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది అని అనుష్క వెల్లడించారు.

అనుష్క సినిమాల విషయానికొస్తే....అనుష్క నటించిన 'వర్ణ' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 65 కోట్ల ఖర్చుతో 'యుగానికొక్కడు' ఫేం సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేసారు. అయితే బాక్సాఫీసు వద్ద ఈచిత్రం ఆశించిన ఫలితాలను రాట్టలేక పోతోంది.
ప్రస్తుతం అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ అదిలాబాద్ జిల్లా కుంటాల వాటర్ ఫాల్స్ వద్ద జరుగుతోంది. దీంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' చిత్రంలో కూడా అనుష్క నటిస్తోంది.


Click it and Unblock the Notifications











