'సైరా నరసింహారెడ్డి'కి అనుష్క సాయం.. చిరు కోసం ఏం చేయబోతోందో తెలుసా!

Recommended Video

Anushka To Give Voice Over For Megastar Chiranjeevi's Sye Raa Movie || Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తుండడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార, తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మరో స్టార్ హీరోయిన్ అనుష్క కూడా సైరా చిత్రంలో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పోరాటానికి తగ్గ గుర్తింపు

పోరాటానికి తగ్గ గుర్తింపు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన పోరాటానికి తగ్గ గుర్తింపుకు నోచుకోలేదు. చాలా మంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి విని ఉంటారు కానీ ఆయన చరిత్ర పూర్తిగా తెలియదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంతో ఆ మహావీరుడి చరిత్ర గురించి ప్రజలు తెలుసుకునే అవకాశం వచ్చింది. సైరా చిత్రంలో నరసింహారెడ్డి పోరాటాలని చూపించబోతున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. సైరా చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

దర్శకుడి ఆలోచన

దర్శకుడి ఆలోచన

చిత్ర షూటింగ్ పూర్తి కావస్తుండడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మాణాంతర కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సైరా చిత్రం చరిత్రకు సంబంధించినది. కాబట్టి నేరుగా కథలోకి వెళ్లడం మంచిది కాదని.. ఆరంభంలో నరసింహారెడ్డి గురించి పరిచయ వాక్యాలని బ్యాగ్ గ్రౌండ్ లో వినిపించాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నారు. సైరా చిత్రంలో వాయిస్ ఓవర్ అందించడానికి అనుష్క అయితే బావుంటుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట.

గంభీరంగా తెలుగులో

గంభీరంగా తెలుగులో

సౌత్ లో అనుష్కకు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా అనుష్క స్పష్టంగా, గంభీరంగా తెలుగులో మాట్లాడగలదు. దీనితో సైరా చిత్రానికి అనుష్క చేత వాయిస్ ఓవర్ చెప్పిస్తే బావుంటుందని సురేందర్ రెడ్డి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే సైరా చిత్రంపై ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. హీరోయిన్ తో వాయిస్ ఓవర్ చెప్పించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

నటీనటులంతా స్టార్లే

నటీనటులంతా స్టార్లే

సైరా చిత్రంలో నటీనటుల్ని గమనిస్తే అంతా స్టార్లే కనిపిస్తారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార, తమన్నా లాంటి క్రేజీ సెలెబ్రిటీలు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైరా చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ప్రస్తుతం సైరా చిత్రం కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X