అనుష్క‌కు గ్రీన్ సిగ్నల్.. కాజల్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కొరటాల శివ..

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం నుంచి హీరోయిన్ త్రిష తప్పుకోవడంతో ఆయన పక్కన నటించే అవకాశం మరోసారి బ్యూటీ కాజల్ అగర్వాల్‌కు దక్కింది. అయితే కొరటాల శివ ఆమెను తప్పించి అనుష్కశెట్టికి అవకాశం కల్పించారనే వార్త మరోసారి ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. కాజల్‌ను తప్పించడానికి అసలు కారణం ఇదే అంటూ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకు ఎందుకు తప్పించారంటే..

అనూహ్యంగా అనుష్క పేరు

అనూహ్యంగా అనుష్క పేరు

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య మూవీ నుంచి త్రిష తప్పుకోవడంతో ఆ తర్వాత కాజల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే రెండు రోజుల తర్వాత అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం కాజల్ అధిక మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే కారణమని తెలుస్తుంది.

కాజల్ భారీ రేంజ్‌లో డిమాండ్‌తో

కాజల్ భారీ రేంజ్‌లో డిమాండ్‌తో

చిరంజీవి సరసన నటించడానికి భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేయడం, ఆ తర్వాత చిత్ర యూనిట్ జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో వెంటనే అనుష్కను ప్రాజెక్టులోకి పట్టుకొచ్చారనేది తాజా సమాచారం. ఇలా కాజల్‌కు కొరటాల శివ చెక్ పెట్టారనే విషయం ఇండస్ట్రీలో సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఎలాంటి షరతులు లేకుండా అనుష్క

ఎలాంటి షరతులు లేకుండా అనుష్క

త్రిషా వదలేసి వెళ్లిన పాత్రను అనుష్క దృష్టికి కొరటాల శివ తీసుకెళ్లగా వెంటనే ఆ పాత్రను పోషించడానికి ఎలాంటి షరతులు లేకుండా అంగీకరించారని తెలిసింది. అయితే అనుష్క మంచితనం కారణంగా కాజల్ అడిగిన రేంజ్‌లోనే పారితోషికాన్ని ముట్టజెప్పడానికి ఆచార్య నిర్మాతలు ముందుకు రావడం జరిగిందనే ప్రచారం మీడియాలో జరుగుతున్నది.

త్వరలోనే అధికారికంగా

త్వరలోనే అధికారికంగా

ఆచార్య మూవీలో చిరంజీవి సరసన అనుష్క శెట్టి చేరిక విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రం నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కనున్నది. ఈ చిత్రంలో చిరంజీవి గోవిందుగా, ఆచార్యగా రెండు రకాల పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Recommended Video

Tollywood Inside Talk | Pspk27 | RRR | NTR 30 | PSPK 27 | Chiru 152 | Prabhas 20
నిశ్శబ్దంతో అనుష్కశెట్టి

నిశ్శబ్దంతో అనుష్కశెట్టి

ఇక అనుష్క విషయానికి వస్తే.. భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం నిశ్శబ్దం అనే చిత్రంలో నటించింది. హేమంత మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి కోన వెంకట్, విశ్వప్రసాద్ నిర్మాతలు. ఈ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే కరొనా వైరస్ భయాల కారణంగా ఈ సినిమా అదే రోజున రిలీజ్ అవుతుందా లేదా అనే వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X