Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వేదం నాగయ్యతో అనుష్క ఫోటో వైరల్ .. కల్మషం లేని స్మైల్ ఫొటో చూపించి.. ఎమోషనల్..
సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు హిట్స్ పడగానే పొగరుగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే తోటి నటీనటులను చిన్న చూపు చూసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది సినిమా తారలు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా సింపుల్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇతర నటీనటులను కూడా స్టార్ హోదాతో సంబంధం లేకుండా ట్రీట్ చేస్తుంటారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. ఇటీవల వేదం నాగయ్య ఫొటో షేర్ చేసుకుంటూ ఆమె స్పందించిన విధానం ఫ్యాన్స్ ను ఎమోషనల్ గా టచ్ చేసింది.
పొట్టి బట్టల్లో రచ్చ.. ఆహానా కుమ్రా పిక్స్ వైరల్
పేరుకు తగ్గట్లుగానే
అనుష్క శెట్టిని అందరూ ముద్దుగా స్వీటి అని పిలుస్తుంటారు. నిజానికి ఆమె మనసు కూడా పేరుకు తగ్గట్లుగానే తియ్యగా ఉంటుంది. స్టార్ హోదాను ఏ రోజు కూడా పైకి చూపించుకోలేదు. తోటి ఆర్టిస్టులకు గౌరవాన్ని ఇవ్వడంలో ఆమె తరువాతే ఎవరైనా. తక్కువ రేంజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు కూడా ఆమె చాలా రెస్పెక్ట్ ఇస్తారు.
అనుష్క ఎమోషనల్
ఇక ఇటీవల వేదం సినిమా నటుడు నాగయ్య ప్రాణాలు విడువడంతో అనుష్క ఎమోషనల్ అవుతూ కామెంట్ చేసింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో అనుష్క ఒక వేశ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, మంచు మనోజ్ వంటి టాప్ స్టార్స్ ఉన్న ఆ సినిమాలో కథ పరంగా వారితో పాటు నాగయ్య సమానమైన రోల్ లో నటించాడు.
కొంటె చూపుతో కాకపుట్టిస్తోంది.. మధురిమ ఫోటోలు వైరల్
వాళ్ళతో నాగయ్య కూడా
అప్పట్లో సినిమాకు సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్ జరిగినా కూడా చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నాగయ్య కూడా ఉండేవాడు. ఆ సినిమాతో అతనికి ఓ వర్గం ఆడియెన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. వేదం సినిమాలో రాములు పాత్రకు కనెక్ట్ అయిన కేటీఆర్ అప్పట్లో ఆర్థిక సహాయం కూడా అంధించారు.
అనుష్కతో నవ్వుతున్న నాగయ్య ఫొటో
ఇక ఇటీవల నాగయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో సోషల్ మీడియాలో అభిమానులు చాలా బాధపడుతూ ట్వీట్ చేశారు. ఇక అనుష్క కూడా తన సంతాపాన్ని తెలియజేసింది. వేదం సినిమా ప్రమోషన్ లో ఒకప్పుడు దిగిన ఫొటోను షేర్ చేసుకుంది. అందులో నాగయ్య కల్మషం లేని వ్యక్తిగా స్వచ్ఛమైన నవ్వుతో ఉన్నాడు.
మంచి ఆత్మ స్వర్గానికి చేరుకుంది
ఒక మంచి ఆత్మ స్వర్గానికి చేరుకుంది. నాగయ్య కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఈ బాధాకరమైన సమయంలో దేవుడు వారిని ఆశీర్వదించి బాధను ఓర్చుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు అనుష్క సోషల్ మీడియాలో పేర్కొన్నారు దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.