ఆ కోరికకి నేనేం అతీతురాలినేం కాదు: అనుష్క
ప్రతి వారికి తనను నలుగురూ గుర్తించాలన్న కోరిక మనసులో వుంటుంది. నేను దానికి అతీతురాలినేం కాదు. అలాగే నన్ను చూసినప్పుడు అభిమానులు గుర్తుపట్టి నా చుట్టూ చేరితే నిజంగా నేను సంతోషిస్తాను అంటోంది అనుష్క. అలాగే అభిమానులును కలిసినందుకు నాకు కూడా ఆనందంగా వుంటుంది. అంతేకాదు అలా అభిమానులు తమ చుట్టూ చేరడం కొంత మంది ఇబ్బందిగా ఫీలవుతుంటారు గానీ నాకు అలా అనిపించదు. అవతలివాళ్లకు ఎన్ని పనులున్నా మనం కనపడినప్పుడు ఆగి పలకరించారంటే వాళ్లు మనల్ని గౌరవిస్తున్నారన్నమాటే. అలాంటి వారిని నేనెప్పుడూ దూరం చేసుకోను. నాకు అభిమానులంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది ఈ బెంగళూరు బ్యూటీ. ప్రస్తుతం అనుష్క..మహేష్ సరసన త్రివిక్రమ్ దర్సకత్వంలో రెడీ అయిన ఖలేజాలో చేస్తోంది. అలాగే నాగార్జున సరసన వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. వెంకటేష్ సరసన చంద్రముఖి సీక్వెల్ లోనూ, లారెన్స్ ముని చిత్రం సీక్వెల్ లోనూ ఆమె ప్రత్యేక పాత్రలు పోషిస్తోంది.


Click it and Unblock the Notifications











