రాత్రి ఎనిమిది దాటితే దానికి నో..అనూష్క
అనూష్క తాను ఈ స్ధాయికి రావటానికి కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉండటమే కారణమంటోంది. అంతేగాక తన ఆరోగ్యం,అందం విషయంలోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉంటానంటోంది. అంతెందుకు ఎవరు మొహమాటపెట్టినా ఎంత బిజీగా ఉన్నా రాత్రి ఎనిమిది దాటాక పొరపాటున కూడా ఆహారం తీసుకోనంటోంది. ఆమె స్లిమ్ సీక్రెట్స్ గురించి మీడియతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. అంతేగాక ఎంత ఇమేజ్ వచ్చినప్పటికీ తను మొదటి సినిమా అప్పుడు ఎలా ఉన్నానో అలాగే ప్రవర్తిస్తుంటాను అంటున్నారు ఈ అందాల తార. అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజూ యోగా చేస్తాను. ఆ తర్వాత నా ఆరోగ్య రహస్యానికి రెండో కారణం - 'వాటర్'. రోజూ సాధ్యమైనంత ఎక్కువ మంచినీరు తీసుకుంటాను. 6 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి కొవ్వు పట్టదు. మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. గ్రీన్ సలాడ్స్ అదే పనిగా తీసుకుంటాను. రాత్రి 8 దాటితే నో ఫుడ్. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను' అని చెప్పారు అనుష. మరి అనూష్కలా అందంగా స్లిమ్ గా ఉండాలంటే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి...తప్పదు.


Click it and Unblock the Notifications











