బెడ్ మీద పది గంటలు గడిపితేనే...అనుష్క
ఇప్పుడు టాలీవుడ్ లో పూర్తి స్ధాయి బిజీ ఎవరంటే కళ్ళు మూసుకుని అనుష్క అని చెప్పచ్చు. అరుంధతి విజయం ఆమె వరసగా సినిమాలు బుక్కయింది. ఓ ప్రక్క మహేష్ సరసన త్రివిక్రమ్ చిత్రంలో చేస్తోంది. మరో ప్రక్క క్రిష్ దర్శకత్వంలో వేదం లో వేశ్య పాత్ర చేస్తోంది. అలాగే నాగార్జున పర్శనల్ మేకప్ మెన్ నిర్మాతగా చేస్తున్న పంచాక్షరి చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. ఇవే కాక భూమిక నిర్మిస్తున్న తకిట తకిట చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. వీటికి తోడు తమిళంలో మొన్నే విజయ్ తో వెట్టకారన్ చేసింది. ఇప్పుడు సూర్య సరసన చేస్తోంది. మరో ప్రక్క రవితేజ సరసన డాన్ శీను అనే చిత్రంలో కమిటయ్యింది. ఎప్పుడు ఇవన్నీ చేస్తున్నారు..అలసట మీకు అనిపించటం లేదా అంటే వారంలో ఓ రోజు పది గంటలు సేపు డిస్ట్రబెన్స్ లేకుండా నిద్రపోతాను. అయినా యోగాతో అన్ని అలసటలు మాయం అంటోంది. అదేం కాదు విజయం ఇచ్చే ఉత్సాహంలో అలసటకు చోటెక్కడుంది అని మరికొందరంటున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











