ఎత్తి చూపితే కోపమెందుకు అనూష్కా?

గత కొంత కాలంగా ఎవరికీ పర్శనల్ ఇంటర్వూలు ఇవ్వటం లేదు. తాజాగా ఆమె నటించిన చింతకాయిల రవి,శౌర్యం విడుదల అవుతున్న సందర్భంలో ఈ రకమైన కోపం ప్రదర్శించటం ఆ నిర్మాతలకు నష్టాన్ని కలుగచేస్తుంది కానీ ఎవరికీ ఏ బాధ ఉండదని నిజం అయినా ఆమె మొండి పట్టుదల వీడటం లేదు. అందులోనూ విస్తృతంగా ప్రచారంలో ఉన్న హీరో గోపీచంద్ తో ప్రేమాయణం రూమర్ ఆమెని ఇబ్బందిపెడుతోందిట. మీడియా మీట్ లో ఆ ప్రశ్నలే అడుగుతారని అసలు వారి జోలికి పోనంటోంది.
అంతేగాక బలాదూర్ షూటింగ్ సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్టు మునిగి చనిపోవటాన్ని అనూష్క భాద్యతగా ఓ టీవీ ఛానెల్ ప్రచారం చేయటాన్ని సహించలేక పోతోందిట.అయినా ఇలా ఎంతకాలం అలిగి కూర్చుంటుంది. ఏదైమైనా ఇది మంచి పద్దతి కాదని...తప్పనేది ఎవరి వైపున ఉన్నా ఖండిచి మాట్లాడవచ్చని అంతోటి దానికి తమకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చే మీడియాను ప్రక్కన పెట్టద్దని సీనియర్స్ సలహా ఇస్తున్నారు. కొందరైతే చేస్తున్న పనులు ఎత్తి చూపితే కోపమెందుకు అని విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











