అనూష్క బికినీ ట్రైనింగ్
బిల్లా సినిమాలో గ్లామరస్ గా బికినీలో ఆ విధంగా కనపడటానికి తను ప్రత్యేకమైన శ్రధ్ద తీసుకున్నానని, నాలుగు నెలలు పాటు ఓ కోచ్ ద్వారా శిక్షణ తీసుకున్నానని అనూష్క ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. అంతేగాక డైట్ లో కూడా కొన్ని మెలకువలు పాటించటం జరిగిందని ఆమె అన్నారు. అందుకు తనకు తెలిసిన యోగా చాలా వరకు దోహదపడిందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఎందుకుని ఎక్సపోజింగ్ చేసే బికినీలో నటించవలిసి వచ్చింది అని అడిగితే దానికామె కేవలం క్యారెక్టర్ డిమాండు వ్ల్లే అలా చేయవలిసి వచ్చింది.వాస్తవానికి అంత ఫ్యాషన్ బుల్ గా కన్పించటం నాకు ఇష్టం ఉండదు. కానీ ఆర్టిస్టు అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలి కదా అంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











