'అరుంధతి' నిర్మాతలతో మళ్ళీ చేయను..అనుష్క
అరుంధతి నిర్మాతలు మళ్లీ నాకు అవకాశం ఇస్తామంటే మాత్రం నేను వేరొకరికి ఇవ్వమని చెబుతా. ఎందుకంటే మరొక మంచి నటి తెలుగు చిత్ర పరిశ్రమకొస్తుంది అంటూ చెప్తోంది అనుష్క. ఎందుకంటే 'విక్రమార్కుడు' సమయంలో నేనొక కొత్త నటిని. నిర్మాత నాపై నమ్మకం పెట్టుకొని 'అరుంధతి' అవకాశం ఇచ్చారు. అదే నా కెరీర్‌కి తిరుగులేకుండా చేసింది అలాంటి ఆఫర్ అందరు హీరోయిన్స్ కి రావాలని కోరుకుంటున్నాను అంది.ఇక మళ్ళీ అరుంధతి లాంటి సినిమా ఎందుకు చేయలేదు అని అడిగితే..అరుంధతి విజయం సాధించాక ఆ తరహా కథలు చాలా విన్నాను. కానీ ఏవీ నాకు నచ్చలేదు. 'పంచాక్షరి' చేశాను. కానీ...అరుంధతి స్థాయి విజయాన్ని ఇవ్వలేదు. సినిమా అనేది ఎప్పుడూ ఒక వ్యక్తివల్ల విజయం సాధించదు. మంచి స్క్రిప్ట్ రావాలి. అందులో మంచి పాత్ర దక్కాలి అంది. ఆమె విక్రమ్ తో కలిసి నటించిన నాన్న చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. అందులో ఆమె లా స్టూడెంట్ గా కనిపించబోతోంది. తొలిసారిగా మేకప్ లేకుండా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











