అందులో ఆశ్లీలం ఎక్కడా కనిపించదు: అనుష్క
అందానికి, అశ్లీలానికీ చాలా తేడా ఉంది.'వేదం'లో వేశ్య పాత్ర చేశాను. అందులో ఆశ్లీలం ఎక్కడా కనిపించలేదు. అమాయకత్వం, నిజాయితీ తప్ప! ఇలాంటి అవకాశాలు అరుదుగానే వస్తాయని అనుష్క చెప్తోంది. అలాగే ఓ సినిమా తీస్తున్నప్పుడు కమర్షియల్ విలువలు పాటించడం చాలా ముఖ్యం. అంతమాత్రాన నైతిక విలువలను మర్చిపోకూడదు. అలాగే నటిగా సంతృప్తి ముఖ్యమా, సినిమా బాగుండడం ముఖ్యమా అని అడిగితే రెండోదే కోరుకొంటాను. ఎందుకంటే ఓ సినిమా ఆర్థికంగా నిలబడినప్పుడే మరిన్ని అవకాశాలు వస్తాయి. పరిశ్రమ బాగుంటుంది. అనుష్క మంచి నటి అని నిరూపించుకోవడానికి కోట్లు గుమ్మరించక్కర్లేదు అని చెప్పింది. ఇక ప్రస్తుతం అనుష్క తమిళ వేదం చిత్రంలో నటిస్తోంది. అలాగే అనుష్క పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో రూపొందుతున్న జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రంలోనూ, ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలోనూ, నాగార్జున సరసన ఢమరుకం చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











