ఆ సినిమా గురించి ఏ మాత్రం పట్టించుకోను...అనుష్క
ఓ హిట్ సినిమా చేజారిపోయింది అని బాధ పడను. ఒక వేళ ఆ సినిమాలో నేను నటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో? ఎవరు చెప్పగలరు అంటోంది అనుష్క. మీరేమన్నా హిట్ సినిమాలు వదులకుని ఆ తర్వాత భాధపడ్డారా అని అడిగినప్పుడు ఇలా స్పందించింది. అలాగే...నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాలేదు. కథ వింటున్నప్పుడే ఆ సినిమా పరిస్థితి ఏమిటో చాలా వరకూ తెలిసిపోతుంది. నేను కథ నచ్చక వదులుకొన్న సినిమాల ఫలితాలు ఏమంత గొప్పగా ఏమీ రాలేదు. అయినా ఒక్కసారి నేను సినిమా వదులుకొంటే ఆ సినిమా గురించి ఏ మాత్రం పట్టించుకోను అంది. ఇక అనుష్క తాజాగా పవన్ కళ్యాణ్,సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో రూపొందుతున్న జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రంలో ఎంపికయింది. అలాగే ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలోనూ, నాగార్జున సరసన ఢమరుకం చిత్రంలోనూ కమిటైంది.


Click it and Unblock the Notifications











